మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Laggam: ‘లగ్గం’.. తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపిస్తుంది

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:21 PM

సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా జంట‌గా నటిస్తున్న సినిమా లగ్గం. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

Laggam: ‘లగ్గం’.. తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపిస్తుంది
laggam

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ (Subishi Entertainments) బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం (Laggam). భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల (Ramesh Cheppala) ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

laggam1.jpeg

సాయి రోనాక్ (Sai Ronak ), ప్రగ్యా నగ్రా (Pragya Nagra) జంట‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.

laggam2.jpeg

మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లినీ కన్నుల విందుగా చూపించ బోతున్నామ‌ని, ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారని, కళ్ళ ముందు కొత్త ఎక్స్పీరియన్స్ ను ఉంచే ఈ సినిమా.. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రం అవుతుందని..." అని దర్శకుడు రమేష్ చెప్పాల (Ramesh Cheppala), నిర్మాత వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy) పేర్కొన్నారు.


GDxgO0faEAAd87Y.jpeg

ఈ సంద‌ర్భంగా.న‌టుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయని, అందుకు భిన్నంగా ఈ లగ్గం సినిమా ఉండ బోతోందని తెలంగాణదనం ఉట్టిపడే విధంగా దర్శకుడు రమేష్ ఈ సినిమాను తేరకెక్కిస్తున్నాడ‌ని" అన్నారు. అన్ని ర‌కాల‌ హంగులతో దర్శకుడు లగ్గం యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్నాడ‌ని న‌టి రోహిణి తెలిపింది.

Updated Date - Mar 04 , 2024 | 12:25 PM