మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Mar 20 , 2024 | 11:46 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 కోసం.. ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

RC16 Movie Launch Event

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం RC16 కోసం.. ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi babu Sana)తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (RC16 Movie Launched)

ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. అలాగే ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమా చేస్తోన్న డైరెక్టర్ శంకర్ వంటి ప్రముఖులెందరో హాజరయ్యారు. వీరంతా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌‌గా మారాయి. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. (#RC16PoojaCeremony)


బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (#Ramcharan)


ఇవి కూడా చదవండి:

====================

*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

***************************

*Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

*************************

*Kanguva: రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌.. చూడాల్సిందే

************************

Updated Date - Mar 20 , 2024 | 12:32 PM