Racharikam: ‘రాచరికం’లో అప్సరా రాణి ఎలా ఉందో చూశారా..

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:34 PM

విజయ్ శంకర్, అప్సరా రాణి హీరోహీరోయిన్లుగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘రాచరికం’. ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ఈ చిత్ర హీరోయిన్ అప్పరా రాణి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె లుక్ పోస్టర్‌ని వదిలారు.

Racharikam: ‘రాచరికం’లో అప్సరా రాణి ఎలా ఉందో చూశారా..
Apsara Rani in Racharikam Movie

విజయ్ శంకర్ (Vijay Shankar), అప్సరా రాణి (Apsara Rani) హీరోహీరోయిన్లుగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘రాచరికం’ (Racharikam). ఈశ్వర్ (Eswar) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. హీరోయిన్ అప్సరా రాణి పుట్టిన రోజు (జనవరి 12) సందర్భంగా ఈ సినిమా నుండి ఆమెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇప్పటి వరకు గ్లామర్‌కే పరిమితమైన అప్పరా రాణికి ఇందులో అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా ఉన్నారు. ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తాయని చిత్రయూనిట్ అంటోంది. (Apsara Rani Birthday Special Poster From Racharikam)


Racharikam.jpg

విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకు వెంగి సంగీతాన్ని అందిస్తుండగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం అప్సరా రాణికి సంబంధించిన ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

====================

*సింగర్ సునీత కుమారుడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. రిలీజైన 10 రోజులకే!

*************************

*Kalki 2898AD: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ చారిత్రాత్మక డేట్‌కే!

*************************

*Vijay: విజయ్‌ న్యూ గెటప్‌.. అసలు విజయ్‌లా లేడు కదా!

*************************

Updated Date - Jan 12 , 2024 | 05:34 PM