మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Aa Okkati Adakku: థమన్ వదిలిన ‘ఓహ్ మేడమ్’ సాంగ్

ABN, Publish Date - Mar 06 , 2024 | 11:53 AM

అల్లరి నరేష్ నటిస్తోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. మార్చి 22న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ ప్రారంభించారు. లీడ్ పెయిర్- అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా‌పై చిత్రీకరించిన ఫస్ట్ సింగిల్ ‘ఓహ్ మేడమ్‌’ను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ లాంచ్ చేశారు.

Aa Okkati Adakku Movie Poster

అల్లరి నరేష్ (Allari Naresh) నటిస్తోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం (Malli Ankam) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ (Chilaka Productions) బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. మార్చి 22న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ ప్రారంభించారు. లీడ్ పెయిర్- అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా‌పై చిత్రీకరించిన ఫస్ట్ సింగిల్ ‘ఓహ్ మేడమ్‌’ (Oh Madam)ను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ లాంచ్ చేశారు.

మనసుని హత్తుకునే మెలోడీ నంబర్స్ స్కోర్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన గోపీ సుందర్ ఈ ఎనర్జిటిక్ మెలోడీకి స్వరాలు సమకూర్చగా.. లిరిసిస్ట్ భాస్కరభట్ల కథానాయకుడిలోని భావాలను అద్భుతంగా వ్యక్తం చేశారు. అనురాగ్ కులకర్ణి తన ప్లజెంట్ వోకల్స్‌తో మ్యాజిక్ చేశాడు. మొత్తంగా, ఈ పాట ఇన్స్టంట్‌గా కనెక్ట్ అవుతుంది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)ల జోడి తెరపై ఫ్రెష్‌గా కనిపించింది. అల్లరి నరేష్ ఆమెతో ఫ్లర్ట్ చేస్తుండగా, ఆమె అతని కంపెనీని ఆనందిస్తుంది. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Oh Madam Lyrical Song From Aa Okkati Adakku)


వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి రైటర్, సూర్య డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లుగా, ఈ చిత్రాన్ని 22 మార్చి 2024న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*RC16: అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్

**************************

*Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..

****************************

Updated Date - Mar 06 , 2024 | 11:53 AM