మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hello Baby: హీరోయిన్ నందితా శ్వేత వదిలిన ‘హలో బేబీ’ మోషన్ పోస్టర్

ABN, Publish Date - Feb 10 , 2024 | 05:51 PM

ఎస్‌కే‌ఎం‌ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘హలో బేబీ’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని తాజాగా హీరోయిన్ నందితా శ్వేత చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ విడుదల అనంతరం నందితా శ్వేత మాట్లాడుతూ.. సోలో క్యారెక్టర్‌తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి గట్స్ ఉండాలంటూ కొనియాడారు.

Nandita Swetha Launches Hello Baby Motion Poster

ఎస్‌కే‌ఎం‌ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘హలో బేబీ’ (Hello Baby). ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని తాజాగా హీరోయిన్ నందితా శ్వేత (Nandita Swetha) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ విడుదల అనంతరం నందితా శ్వేత మాట్లాడుతూ.. సోలో క్యారెక్టర్‌తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి గట్స్ ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డ్స్ ఇంకా చాలా ఈ చిత్రానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. (Hello Baby Movie Motion Poster Launch)


చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ (Kandregula Adhi Narayana) మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్‌తో చేసిన చిత్రమిది. ఈ చిత్రం చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం కుదిరింది. మా దర్శకుడు రామ్ గోపాల్ రత్నం (Ram Gopal Ratnam) చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మంచి సంగీతాన్ని అందించారు. చిత్ర కెమెరామెన్ రమణ కె నాయుడు అద్భుతంగా చిత్రాన్ని తీశారు. ఎడిటర్ సాయిరాం తాటిపల్లి అద్భుతమైనటువంటి ఎడిటింగ్ ఎఫెక్ట్‌తో, సింగిల్ క్యారెక్టర్ పాత్రలో నటించిన కావ్యకీర్తి అద్భుతమైన నటనతో అతిత్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన నటి నందితా శ్వేతకు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్

**************************

*Kayal Anandhi: ఈ సినిమా నా సినీ ఇమేజ్‌ను మార్చేస్తుంది

******************************

*మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..

**************************

Updated Date - Feb 10 , 2024 | 05:51 PM