Lorry Chapter 1: యూట్యూబ్‌ వీడియోలతో పాపులర్.. ఇప్పుడు హీరో, దర్శకనిర్మాతగా!

ABN , Publish Date - May 16 , 2024 | 03:39 PM

కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ కథ, స్టంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘లారి చాప్టర్-1’. చెన్నై లొయోల కాలేజీ‌లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం సంపాదించిన తర్వాత యూట్యూబ్‌లో తన వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీకాంత్ రెడ్డి.. ఇప్పుడు ‘లారి చాప్టర్-1’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

Lorry Chapter 1: యూట్యూబ్‌ వీడియోలతో పాపులర్.. ఇప్పుడు హీరో, దర్శకనిర్మాతగా!
Lorry Chapter 1 Movie Stills

కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ రెడ్డి ఆసం (Sreekanth Reddy Asam) హీరోగా నటిస్తూ కథ, స్టంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘లారి చాప్టర్-1’ (Lorry Chapter 1). చెన్నై లొయోల కాలేజీ‌లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం సంపాదించిన తర్వాత యూట్యూబ్‌లో తన వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీకాంత్ రెడ్డి.. ఇప్పుడు ‘లారి చాప్టర్-1’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చంద్రశిఖ (Chandra Shikha) నటించగా రాఖీ సింగ్ (Rakhi Singh) ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

*ఒకవైపు కలెక్షన్స్ లేక సినిమాహాల్స్ మూత, ఇంకోవైపు 'కృష్ణమ్మ' బ్రేక్ఈవెన్


Lorry-Chapter-1.jpg

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ.. చెన్నై లొయోల కాలేజీ‌లో డైరెక్షన్ కోర్స్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ నా కెరీర్ ప్రారంభించాను. యూట్యూబ్‌లో చేసిన వీడియోలతో వ్యూస్‌తో పాటు మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో వర్క్ చేశాను. ఇప్పుడీ ‘లారి చాప్టర్-1’ అనే సినిమాతో హీరోగా, దర్శకనిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇది ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాం. సినిమా ఫస్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల చేస్తాము. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ.. అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని తెలిపారు. (Lorry Chapter 1 Movie First Look Launched)

Read Latest Cinema News

Updated Date - May 16 , 2024 | 05:15 PM