Producer: పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకునే నటీనటులను ఆదర్శంగా తీసుకోవద్దు

ABN , Publish Date - May 16 , 2024 | 01:44 PM

ఇటీవలకాలంలో తమిళ చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న పలువురు విడాకులు తీసుకుంటున్నారు. దీనిపై సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌ స్పందించారు. అభిమానులు తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆదర్శంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తాజాగా చెన్నైలో జరిగిన ‘కన్ని’ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Producer: పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకునే నటీనటులను ఆదర్శంగా తీసుకోవద్దు
GV Prakash Kumar and Dhanush

ఇటీవలకాలంలో తమిళ చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న పలువురు విడాకులు తీసుకుంటున్నారు. దీనిపై సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌ (Producer and Actor K Rajan) స్పందించారు. అభిమానులు తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆదర్శంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సన్‌ లైఫ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎం.సెల్వరాజ్‌ నిర్మాణంలో దర్శకుడు మాయోన్‌ శివ తొరప్పాడి తెరకెక్కించిన చిత్రం ‘కన్ని’ (Kanni). అశ్విని చంద్రశేఖర్‌, మణిమారన్‌, తారా క్రిష్‌, రామ్‌ భరతన్‌ తదితరులు నటించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర ఆడియో వేడుకను తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా నిర్మాత కె.రాజన్‌, కోలీవుడ్‌ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి పేరరసు (Perarasu) పాల్గొన్నారు. (Kanni Audio Launch)

*Shivani Rajasekhar: రాజశేఖర్ కుమార్తె శివాని స్పెషల్ ఏంటో తెలుసా...


K-Rajan.jpg

ఈ సందర్భంగా కె.రాజన్‌ (K Rajan) మాట్లాడుతూ.. చిత్ర టైటిల్‌ అచ్చమైన తమిళ పదంలా ఉంది. కన్య అంటేనే ఎంతో పవిత్రమైనది. దర్శకుడు మాయోన్‌ దగ్గర ప్రతిభ పుష్కలంగా ఉంది. దర్శకుడు తీసుకున్న కథాంశంలో తమిళ వారసత్వం, తమిళ సంస్కృతి, సంప్రదాయ సిద్ధవైద్య విధానం ఉంది. ఒక మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఇటీవలకాలంలో విడాకులు తీసుకునే నటీనటుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం. తమ అభిమాన నటీనటులను అభిమానులు ఆదర్శంగా తీసుకుని, గుడ్డిగా వారిని అనుసరించవద్దు. పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవడం ఏమాత్రం సబబు కాదు. మొన్న ధనుష్‌ - ఐశ్వర్య (Dhanush and Aishwarya), ఇపుడు జీవీ ప్రకాష్‌ - సైంధవి (GV Prakash and Saindhavi). ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇపుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదన్నారు. ఈ వేడుకలో మరో ముఖ్య అతిథి పేరరసు, చిత్ర దర్శకుడు మాయోన్‌ శివ, సినీ నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 16 , 2024 | 01:45 PM