Kavya Kalyanram: 'బలగం' భామ నాట్య భంగిమలు చూశారా !

ABN , Publish Date - May 06 , 2024 | 06:22 PM

చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి, చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదానా అంటూ అప్పుడెప్పుడో ఘంటసాల పాడిన పాట గుర్తుకు వస్తోంది కదా, ఇప్పుడు కావ్య కళ్యాణ్ రామ్ ని ఇలా చీరలో చూస్తుంటే. ఇంతకీ ఈ చీర వెనక కథ ఏంటంటే...

Kavya Kalyanram: 'బలగం' భామ నాట్య భంగిమలు చూశారా !
Kavya Kalyanram

బాలనటిగా తన ప్రతిభని నిరూపించుకున్న కావ్య కళ్యాణ్ రామ్, తరువాతి కాలంలో కథానాయికగా ఎదిగి 'మాసూద' అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, కావ్యకి కూడా మంచి ప్రశంశలు వచ్చాయి. (Kavya Kalyanram of Balagam fame posted some of her latest photos)

balagamactress.jpg

తరువాత కావ్య 'బలగం' సినిమాలో కథానాయికగా నటించింది. ప్రియదర్శి కథానాయకుడు, ఇందులో ఆమె తన హావ భావాలతో, చిన్న చిన్న మాటలతో సినిమాలో తనదైన ప్రతిభ కనపరిచింది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించటమే కాకుండా, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. కావ్యకి రెండో విజయం లభించింది. (Latest news update on Kavya Kalyanram of Balagam fame)

kavyakalyanrambalagamone.jpg

ఎంఎం కీరవాణి తనయుడు సింహ కోడూరి పక్కన 'ఉస్తాద్' సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా వ్యాపారాత్మకంగా విజయం సాధించలేదు, కానీ కావ్యకి మంచి పేరు తీసుకువచ్చింది. తాను ఎటువంటి పాత్రనైనా చెయ్యగలను అని నిరూపించింది.

balagamactressone.jpg

ఈమధ్యనే 'ఓ సెలియా' అనే ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. ఈ వీడియో పాటలో, తానొక క్లాసికల్ డాన్సర్ అని చెప్పకనే చెప్పింది. ఇందులో తనకి నాట్యం పట్ల కూడా మంచి అవగాహన వుంది అని, ఈ పాట వీడియో చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది.

balagambhama.jpg

ఇప్పుడు అదే వీడియో పాటనుండి కొన్ని ఫోటోలను తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది కావ్య కళ్యాణ్ రామ్. అయితే ఈ ఫోటోలకి ఆమె ఎటువంటి వ్యాఖ్యలు రాయలేదు. మామూలుగా కొన్ని ఫోటోలను మాత్రం పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతూ వున్నాయి.

balagambama.jpg

Updated Date - May 06 , 2024 | 06:22 PM