Kavya Kalyanram: బన్నీతో మొహమాటం లేకుండా చెప్పేశా

ABN , First Publish Date - 2023-08-20T11:53:18+05:30 IST

కావ్య కళ్యాణ్‌రామ్‌... ‘వల్లంకి పిట్ట , ‘పొట్టిపిల్ల’గా ఇప్పటికే అందరికీ సుపరిచితం. బాలనటిగా పలు సినిమాల్లో మెప్పించి, ‘మసూద’తో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ‘బలగం’ సూపర్‌ సక్సెస్‌తో క్రేజ్‌ పెంచుకుంది. తాజాగా ‘ఉస్తాద్‌’తో అలరించిన ఈ అచ్చ తెలుగమ్మాయిని పలకరిస్తే బోలెడు విషయాలు చెప్పింది. వాటిలో కొన్ని..

Kavya Kalyanram: బన్నీతో మొహమాటం లేకుండా చెప్పేశా

కావ్య కళ్యాణ్‌రామ్‌(kalyan ram)... ‘వల్లంకి పిట్ట , ‘పొట్టిపిల్ల’గా ఇప్పటికే అందరికీ సుపరిచితం. బాలనటిగా పలు సినిమాల్లో మెప్పించి, ‘మసూద’(Masooda)తో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ‘బలగం’(Balagam) సూపర్‌ సక్సెస్‌తో క్రేజ్‌ పెంచుకుంది. తాజాగా ‘ఉస్తాద్‌’తో (ustaad)అలరించిన ఈ అచ్చ తెలుగమ్మాయిని పలకరిస్తే బోలెడు విషయాలు చెప్పింది. వాటిలో కొన్ని..

చెయ్యనని చెప్పా...

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు ఏదో ఫంక్షన్‌లో నన్ను చూశారట. నా కళ్లు బాగా నచ్చి ‘గంగోత్రి’లో హీరోయిన్‌ చిన్నప్పటి పాత్రకు నన్ను బాలనటిగా ఎంపిక చేశారు. సరదాగా ప్లేగ్రౌండ్‌కి వెళ్తున్నట్లుగా షూటింగులకి వెళ్లేదాన్ని. అలా చిన్నప్పుడే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ లాంటి బిగ్‌స్టార్స్‌తో నటించే అవకాశం లభించింది. ‘పెద్దయ్యాక నాతో హీరోయిన్‌గా నటిస్తావా?’ అని ‘గంగోత్రి’ షూటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ తమాషాగా అడిగితే... ‘అప్పటికి మీరు ముసలోళ్లవుతారు. నేను చెయ్యను’ అని నవ్వుతూ బదులిచ్చేదాన్ని. నేను పెద్దయ్యాను కానీ, ఆయన మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు.

ఆయన మెచ్చుకున్నారు

‘బలగం’ సినిమా ఆడిషన్‌ కోసం దిల్‌రాజు గారి ఆఫీసు నుంచి కాల్‌ వచ్చింది. నేను క్యాజువల్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని వెళ్లాను. డైరెక్టర్‌ వేణు నన్ను చూసి ‘పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌. కుర్తీ, దుపట్టా వేసుకుని మళ్లీరా’ అన్నారు. త్వరత్వరగా ఇంటికెళ్లి డ్రెస్‌ మార్చుకుని వచ్చా. అప్పుడు కాస్త ఊరి అమ్మాయిలా కనిపించడంతో ఓకే చేశారు. ‘బలగం’ విడుదలయ్యాక రాఘవేంద్రరావుగారు నన్ను పిలిచి మెచ్చుకున్నారు.


3.jpgకీర్తి యాక్టింగ్‌కి ఫిదా

ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తుంటా. ‘దసరా’లో కీర్తి సురేష్‌ను చూసి ఫిదా అయ్యా. జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ నటనంటే చాలా చాలా ఇష్టం. కథానాయికల్లో సమంత, సాయిపల్లవికి వీరాభిమానిని. సమంత కెరీర్‌ గ్రాఫ్‌ నాలాంటి వాళ్లకి స్ఫూర్తిదాయకం. సాయిపల్లవి స్ర్కిప్ట్‌ సెలెక్షన్‌ సూపర్బ్‌.

స్పెషల్‌ గిఫ్ట్‌...

నేను ప్రత్యేకమైన లిప్‌బామ్‌ వాడుతా. అది యూఎస్‌లో మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడూ నా వ్యాలెట్‌లో ఉంటుంది. ఇటీవల ‘ఉస్తాద్‌’లో నా సహ నటుడు శ్రీసింహ (కీరవాణి కొడుకు) తన తండ్రితో కలసి ఆస్కార్‌ వేడుకలకు యూఎస్‌ వెళ్లాడు. ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఆ బ్రాండ్‌ లిప్‌బామ్‌లు పది తీసుకొచ్చి బహు మతిగా ఇచ్చాడు. అవి ఎప్పటికీ నాకు స్పెషలే.

లాయర్‌ యాక్టర్‌ ...

మాది ఖమ్మంలోని కొత్తగూడెం. కానీ పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ‘లా’ పూర్తి చేశా. లాయర్‌గానే సెటిలైపోదామని ఫిక్స్‌ అయ్యాను... కానీ కొవిడ్‌ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు... ‘మళ్లీ సినిమాల్లో ప్రయత్నిస్తే ఎలా ఉంటుంద’నే ఆలోచన తట్టింది. ఆ విషయాన్ని రాఘవేంద్రరావు గారితో షేర్‌ చేసుకున్నా. ‘చేసేది తక్కువ సినిమాలైనా, ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా ఎంపిక చేసుకోమ’ని సలహా ఇచ్చారు. హీరోయిన్‌గా ‘మసూద’ నా మొదటి సినిమానే అయినా... అంతకు ముందు చాలా ఆడిషన్స్‌కి వెళ్లి రిజెక్ట్‌ అయ్యా.


1.jpg

ఫటాఫట్‌

ముద్దుపేరు: అమ్ము

ఇష్టమైన ప్రదేశం: బీచ్‌

నిద్రలేవగానే చేసే పని: ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తా

ఎవరికీ తెలియని విషయం: కూచిపూడి, డ్యాన్సర్‌ని, జిల్లాస్థాయి వాలీబాల్‌

ప్లేయర్‌ని కూడా.

ఇష్టమైన ఫుడ్‌: ఆవకాయ, అన్నం

సెలబ్రిటీ క్రష్‌: నాగచైతన్య

నా ప్లస్‌ పాయింట్‌: పరిస్థితులను, భావోద్వేగాలను సులువుగా అర్థం చేసుకుంటా.

మైనస్‌ పాయింట్‌: బద్ధకం కాస్త ఎక్కువే

అభిమాన దర్శకులు: గౌతమ్‌ మీనన్‌, శేఖర్‌ కమ్ముల, మణిరత్నం.6.jpg

Updated Date - 2023-08-20T11:54:12+05:30 IST