Game Changer: జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:45 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఈ చిత్రం నుండి ‘జరగండి’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్‌ నిర్మాతలు.

Game Changer: జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది
Game Changer Movie Stills

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (GlobalstarRamcharan) హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) భారీ బ‌డ్జెట్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు (HappyBirthdayRamCharan). ఈ సంద‌ర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జ‌ర‌గండి’ (Jaragandi Lyrical Video Song) అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 150 పైన థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించటం విశేషం. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ (SS Thaman) సంగీత సారథ్యంలోని ఈ పాట‌ను అనంత శ్రీరామ్ (Ananth Sriram) రాయ‌గా ద‌లేర్ మెహందీ (Daler Mehndi), సునిధీ చౌహాన్ (Sunidhi Chauhan) పాడారు.

‘జ‌ర‌గండి జ‌ర‌గండి

జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి

జ‌ర‌గండి జ‌ర‌గండి

పార‌డైసు పావ‌డేసుకొచ్చెనండి..’ అంటూ మ‌న‌సుకు న‌చ్చిన క‌థానాయిక కియారా అద్వానీని చూసి హీరో రామ్ చ‌ర‌ణ్‌ పాట పాడితే, మ‌రి దాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తే చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వ‌నేంత గొప్ప‌గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. రామ్ చ‌ర‌ణ్‌, కియారా ఆటా పాట‌, త‌మ‌న్ సంగీతం, శంక‌ర్ మేకింగ్ స్టైల్లో వావ్ అనేలా తెర‌కెక్కిన ఈ పాట‌ను చూడాలంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌. (Jaragandi Lyrical Video Song From Game Changer)


Ram-Charan.jpg

‘జరగండి’ పాట విషయానికి వస్తే.. రామ్ చరణ్, కియార అద్వానీ (Kiara Advani) జంట స్క్రీన్‌పై చూడ ముచ్చ‌ట‌గా ఉంది. ఇక డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్‌లో త‌న‌దైన భారీతనాన్ని చూపించ‌బోతున్నార‌ని పాట‌లోని కొన్ని స‌న్నివేశాల‌ను చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. పాటే ఈ రేంజ్‌లో ఉంటే శంక‌ర్.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ఏ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌స్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమా కోసం మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

*****************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

********************

*Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..

************************

Updated Date - Mar 27 , 2024 | 04:45 PM