Siva Kantamneni: నన్ను మరికొన్ని మెట్లు ఎక్కించే సినిమా ఇది..

ABN , Publish Date - May 23 , 2024 | 07:05 PM

చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ... దర్శకసంచలనం, ‘రాజమౌళి ఆఫ్ భోజపురి’ పేరున్న గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బిగ్ బ్రదర్’. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నన్ను మరికొన్ని మెట్లు ఎక్కిస్తుందని అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్, చిత్ర హీరో శివ కంఠంనేని తెలిపారు.

Siva Kantamneni: నన్ను మరికొన్ని మెట్లు ఎక్కించే సినిమా ఇది..
Siva Kantamneni in Big Brother

చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ... దర్శకసంచలనం, ‘రాజమౌళి ఆఫ్ భోజపురి’ పేరున్న గోసంగి సుబ్బారావు (Subbarao Gosangi) దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బిగ్ బ్రదర్’ (Big Brother). ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్ శివ కంఠంనేని (Siva Kantamneni) టైటిల్ పాత్ర పోషించారు. జి. రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే (Priya Hegde) హీరోయిన్‌గా నటించారు.

*Bengaluru Rave Party: పేరు మార్చిన హేమ, అసలు పేరేంటో తెలిస్తే షాకవుతారు!


Big-Brother.jpg

ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో శివ కంఠంనేని (Siva Kantamneni About Big Brother) మాట్లాడుతూ... గోసంగి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బిగ్ బ్రదర్’. ఈ చిత్రం నటుడిగా నన్ను మరి కొన్ని మెట్లు ఎక్కిస్తుందనే నమ్మకముంది. నటుడిగా నాకు మళ్ళీ అవార్డులు తెచ్చే ఈ చిత్రం మా నిర్మాతలకు రివార్డులు కూడా తెచ్చిపెట్టి, వారు మరిన్ని మంచి సినిమాలు తీసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దయచేసి అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. శ్రీసూర్య, ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ వంటివారు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. (Big Brother Ready to Release)

Read Latest Cinema News

Updated Date - May 23 , 2024 | 07:05 PM