Game On: ఇది దమ్మున్న సినిమా అంటున్నారు

ABN , Publish Date - Jan 30 , 2024 | 08:11 PM

క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ గేమ్ ఈవెంట్‌ను తాజాగా మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యారు.

Game On: ఇది దమ్మున్న సినిమా అంటున్నారు
Game On Pre Release Event

క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సంద‌ర్భంగా సోమవారం మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంతరం బిగ్ టిక్కెట్‌ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ఈ సినిమా నేను చూశాను. మంచి కాన్సెప్ట్‌తో చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్‌లా ఎక్కడా అనిపించలేదు. ప్యాక్డ్ స్క్రీన్‌ప్లే‌తో రూపొందించారు. హీరో గీతానంద్ పెర్ఫార్మెన్స్ అందరినీ అలరిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. మరో గెస్ట్ శివ బాలాజీ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం హీరో, డైరెక్టర్ వాళ్ల నాన్న కుమార్ గారే. వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను. దయానంద్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీతా ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్ముతున్నాను. మంచి టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కి, ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్.. అని చెప్పారు. (Game On Pre Release Event)


game-On-Movie.jpg

హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే సైకలాజికల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్, ట్విస్టులు, విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను చాలా కష్టాలు పడ్డాను. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలనుకున్నా. థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఇది దమ్మున్న సినిమా అనుకునేలా దీన్ని రూపొందించాం. మా తమ్ముడు దయానంద్ అద్భుతమైన వర్క్ చేశాడు. కమలహాసన్ ‘విక్రమ్’ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎలా మాట్లాడుకున్నారో ఇందులో కూడా అలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ని అభిషేక్ అందించాడు. థియేటర్స్‌లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ఈ కంటెంట్ గురించి మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మా గేమ్‌ని ప్రేక్షకులు గెలిపిస్తారని నమ్ముతున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహా సోలంకి, శుభలేఖ సుధాకర్, నిర్మాత రవి కస్తూరి వంటి వారు మాట్లాడుతూ.. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

*****************************

*Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్

***********************

*Santhanam: నొప్పించడానికి కాదు.. నవ్వించేందుకే సినిమాల్లోకి వచ్చా

************************

Updated Date - Jan 30 , 2024 | 08:11 PM