మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lucky Baskhar: దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబో ఫిల్మ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ABN, Publish Date - Feb 03 , 2024 | 06:04 PM

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో చేస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. వినోదభరితమైన మరియు హృదయాన్ని కదిలించే కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ‘లక్కీ భాస్కర్’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Dulquer Salmaan in Lucky Baskhar

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).. అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని పాన్-ఇండియా నటుడిగా ఎదిగారు. గత 12 సంవత్సరాలుగా తన నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దుల్కర్.. ఇప్పటికే చిరస్థాయిగా నిలిచిపోయే పలు చిత్రాలను అందించారు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో చేస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. వినోదభరితమైన మరియు హృదయాన్ని కదిలించే కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. (Dulquer Salmaan Starring Lucky Baskhar First Look)

నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ‘లక్కీ భాస్కర్’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నట్లుగా దుల్కర్ ఇందులో కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని, ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం గురించి ఈ సినిమా చెబుతుందని నిర్మాతలు చెబుతున్నారు.


ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘సార్(వాతి)’ వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ ఎటువంటి సందేహం లేకుండా ప్రేక్షకులను మెప్పించే గొప్ప చిత్రం అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

**************************

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

*Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

****************************

*‘లాల్‌సలాం’కు ధన్య బాలకృష్ణ రూపంలో చిక్కులు?.. సారీ చెప్పిన నటి..!

***************************

Updated Date - Feb 03 , 2024 | 06:04 PM