Double iSmart: ‘పుష్ప 2’ డేట్‌కే ‘డబుల్ ఇస్మార్ట్’.. దెబ్బ మీద దెబ్బ!

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:08 PM

‘పుష్ప 2’ వాయిదా పడుతుందనే వార్త అలా వచ్చిందో లేదో.. ఇప్పుడు ఇంకో సినిమా ఆ డేట్‌ని లాక్ చేయడం చూస్తుంటే.. నిజంగానే ‘పుష్ప 2’ వాయిదా పడుతుందనే దానికి ఊతం ఇచ్చినట్లయింది. ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌కే లాక్ అయిన ఆ చిత్రం ఏదో కాదు.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Double iSmart: ‘పుష్ప 2’ డేట్‌కే ‘డబుల్ ఇస్మార్ట్’.. దెబ్బ మీద దెబ్బ!
Pushpa 2 and Double iSmart Movie Stills

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)కు దెబ్బ మీద దెబ్బ పడింది. కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌పై నెగిటివ్ టాక్ ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. ముఖ్యంగా తన ఫ్రెండ్‌, వైసీపీ లీడర్ ప్రచార నిమిత్తం నంధ్యాల వెళ్లినప్పటి నుంచి సోషల్ మీడియాలో అల్లు వేరు, మెగా వేరు అనేలా ఒకటే వార్తలు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా.. ఇప్పటి వరకు చెబుతూ వస్తోన్న ‘పుష్ప 2’ సినిమా చెప్పిన డేట్‌కి కాకుండా ఈ ఇయర్ ఎండింగ్‌కి వాయిదా పడుతుందనేలా వస్తోన్న వార్త అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ (Allu Arjun Fans)ని మరింతగా డిజప్పాయింట్ చేస్తోంది. ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్త అలా వచ్చిందో లేదో.. ఇప్పుడు ఇంకో సినిమా ఆ డేట్‌ని లాక్ చేయడం చూస్తుంటే.. నిజంగానే ‘పుష్ప 2’ (Pushpa 2) వాయిదా పడుతుందనే దానికి ఊతం ఇచ్చినట్లయింది. సరే.. ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌కే లాక్ అయిన ఆ చిత్రం ఏదో కాదు.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart).

Also Read- Niharika Konidela: అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందనిదే..

రామ్ పోతినేని (Ram Pothineni), పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) కాంబోలో తెరకెక్కి మ్యాసీవ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కాబోతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అవుతున్నా.. విడుదల తేదీ విషయంలో మాత్రం మేకర్స్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఐకాన్ స్టార్ ‘పుష్ప 2’ విడుదల వాయిదా అనేలా వార్తలు వైరల్ అయ్యాయో లేదో.. ఆ డేట్‌ని లాక్ చేసి.. వెంటనే ప్రకటించేశారు. (Double iSmart Movie Release Date)


Double-ismart.jpg

హీరో రామ్ (Hero Ram) కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా.. ‘మామా! డేట్ బ్లాక్ కర్!.. ఉస్తాద్ డబుల్ ఇస్మార్ట్ శంకర్’ అంటూ రిలీజ్ డేట్‌ పోస్టర్‌ని షేర్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రామ్ చేసిన ఈ ట్వీట్ ఆయన ఫ్యాన్స్ కూడా ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో పాటు పూరీ జగన్నాధ్‌ పలు సినిమాలకు మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ ‘డబుల్ ఇస్మార్ట్‌’కు సంగీతం అందిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 05:08 PM