Double Ismart: రామ్‌తో పోటీపడటానికి సంజు సిద్ధం!

ABN , First Publish Date - 2023-07-29T10:06:45+05:30 IST

ఎనర్జీటిక్‌ హీరో రామ్‌.. కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ముంబైలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కనిపించనున్నారు.

Double Ismart:  రామ్‌తో పోటీపడటానికి సంజు సిద్ధం!

ఎనర్జీటిక్‌ హీరో రామ్‌(Ram potineni).. కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jaganath) కలయికలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’(Double ismart). వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ముంబైలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ (Sanjay dutt) కనిపించనున్నారు. శనివారం సంజయ్‌దత్‌ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థతోపాటు, సంజయ్‌దత్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. సంజయ్‌ దత్‌ చేస్తున్న బిగ్‌బుల్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. సిగార్‌ కాలుస్తూ, ఫంకీ హెయిర్‌ స్టైల్‌, చేతికి ఉంగరాలు, వేళ్ల మధ్య టాటూలతో సంజయ్‌ లుక్‌ స్ఫోర్టిపైయింగ్‌గా ఉంది. (BigBull)

‘‘పూరిలాంటి మాస్‌ డైరెక్టర్‌, ఎనర్జీటిక్‌ స్టార్‌ రామ్‌తో కలిసి పనిచేయడం చాలా గర్వంగా ఉంది. సైంటిఫిక్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్‌బుల్‌ అనే పాత్ర చేస్తున్నా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో రామ్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి స్టంట్‌ డైరెక్టర్‌ కెచ్చా నేతృత్వం వహిస్తున్నాడు. వచ్చే వారంతో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ పూర్తి కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-07-29T10:08:11+05:30 IST