Pushpa2 The Rule: ‘సూసేకీ అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామి’ .. పుష్ప సెకండ్ సింగిల్ విడుద‌ల ఎప్పుడంటే

ABN , Publish Date - May 23 , 2024 | 11:23 AM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ఫ 2 ది రూల్ నుచి మేక‌ర్స్ మ‌రో అప్డేట్ ఇచ్చారు. సూసేకీ అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే పాటను ఈ నెల 29న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Pushpa2 The Rule: ‘సూసేకీ అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామి’ .. పుష్ప సెకండ్ సింగిల్ విడుద‌ల ఎప్పుడంటే
pushpa

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar), దేవీ శ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) హ్యాట్రిక్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ఫ 2 ది రూల్ (Pushpa2 The Rule). ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్లు, గ్లిమ్స్ సినిమాపై ప్ర‌పంచ వ్యాప్తంగా అంచ‌నాలు అమాంతం పెంచేశాయి. అదేవిధంగా అల్లుఅర్జున్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పుష్ఫ పుష్ఫ PushpaPushpa అనే పాట‌ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుండ‌డం విశేషం.

pushpa.jpg


అయితే తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మంగ‌ళ‌వారం (21.05.2024)న ప్ర‌క‌టించిన మేక‌ర్స్ చెప్పిన విధంగానే ఈ రోజు (గురువారం) స‌రిగ్గా 11 గంట‌ల 7 నిమిషాల‌కు రెండో పాట‌కు (Pushpa2 Second Single) సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘సూసేకీ అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ అల్లు అర్జున్, క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్నాల‌పై చిత్రీక‌రించిన పాటను ఈ నెల 29న ఉదయం 11 గంట‌ల 7 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Updated Date - May 23 , 2024 | 11:28 AM