Dirty Fellow: ‘డర్టీ ఫెలో’ ట్రైలర్ వదిలిన ‘విశ్వంభర’ దర్శకుడు

ABN , Publish Date - May 17 , 2024 | 04:38 PM

శ్రీమతి గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శాంతిచంద్ర, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరోహీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి.యస్. బాబు నిర్మించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మే 24న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ఠ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Dirty Fellow: ‘డర్టీ ఫెలో’ ట్రైలర్ వదిలిన ‘విశ్వంభర’ దర్శకుడు
Dirty Fellow Trailer Launch Event

శ్రీమతి గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శాంతిచంద్ర (Santhi Chandra), దీపికా సింగ్ (Deepika Singh), మిస్ ఇండియా 2022 సిమ్రితి (Simrithi) హీరోహీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి (Adari Murthy Sai) దర్శకత్వంలో జి.యస్. బాబు (GS Babu) నిర్మించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మే 24న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీ దర్శకుడు మల్లిడి (Vassishta Mallidi) వశిష్ఠ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో శాంతిచంద్ర, చిత్ర దర్శకుడు మూర్తి సాయి అడారి మరియు ఇతర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

*Nagababu: అల్లు ఆర్మీ సెగ.. వివాదం ముదరకుండా ఉండటం కోసమే అలా చేశారా?

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు మల్లిడి వశిష్ఠ (Vassishta Mallidi) మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన ‘డర్టీ ఫెలో’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. మే 24న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. చిత్ర దర్శకుడు మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ... మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన వశిష్ఠకు ధన్యవాదాలు. మే 24న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని తెలిపారు. (Vassishta Mallidi Launches Dirty Fellow Trailer)


Dirty-Fellow-Movie.jpg

చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. మా టీమ్ తరపున మల్లిడి వశిష్ఠగారికి ధన్యవాదములు. మే 24న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. ఇటీవల మధుర ఆడియో ద్వారా విడుదలైన అన్ని పాటలు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి మా టీమ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. (Dirty Fellow Movie)

Read Latest Cinema News

Updated Date - May 17 , 2024 | 05:21 PM