Director Shankar: ‘ఇండియన్ 2’.. అంతకుమించి!

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:32 PM

‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ‘ఇండియన్ 2’ అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు సంచలన దర్శకుడు శంకర్. కమల్ హాసన్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ కాబోతోంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

Director Shankar: ‘ఇండియన్ 2’.. అంతకుమించి!
Director Shankar

‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ‘ఇండియన్ 2’ అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు సంచలన దర్శకుడు శంకర్. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Ulaganayagan Kamalhaasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu 2). ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Bharateeyudu 2 Audio Launch Event)

Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు

ఈ కార్యక్రమంలో శంకర్ (Director Shankar) మాట్లాడుతూ.. ‘శనివారం ఉదయమే ఫైనల్ మిక్సింగ్ విన్నాను. అనిరుధ్ మ్యాజిక్ చేశాడు. సరికొత్త ఎనర్జీ వచ్చింది. ఆడియెన్స్‌కి కూడా సినిమా చూశాక అదే ఎనర్జీ వస్తుంది. ఇండియన్ టైంలోనే కమల్ హాసన్‌గారు సీక్వెల్ తీద్దామని అన్నారు. కానీ అప్పుడు నా వద్ద సరైన కథ లేదు. చాలా ఏళ్లకు పేపర్స్‌లో లంచం వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నాను. కానీ అప్పుడు నేను, కమల్ హాసన్ గారు వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదు. ‘2.ఓ’ తరువాత ఈ కథ రాసుకున్నాను. అలా ఇండియన్ 2 మొదలైంది. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్‌ని చూసి అంతా షాక్ అయ్యాం. 28 ఏళ్ల క్రితం ఎలా అనిపించిందో.. అప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదు. ఆయన 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం ఆనందంగా ఉంది.


Indian-2.jpg

ఎస్ జే సూర్య డిఫరెంట్ రోల్ చేశారు. సముద్రఖని, సిద్దార్థ్, బాబీ సింహా చక్కటి పాత్రలు పోషించారు. మనోబాలా, వివేక్ గారు మన మధ్య లేరు. కానీ వాళ్ల పాత్రలు మనతో గుర్తుండిపోతాయి. కాజల్, రకుల్ అద్భుతంగా నటించారు. ఇండియన్ 2 వేరే నిర్మాతతో సినిమా చేయాలి. కానీ లైకా నుంచి సుభాస్కరన్ గారు ఫోన్ చేసి ‘నేను నిర్మిస్తాను.. నాకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టం. నేనే నిర్మిస్తాను’ అని అన్నారు. మాకు ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మాకు అండగా నిలిచిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ముత్తు రాజ్ గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ‘ఇండియన్ 2’ అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 02 , 2024 | 05:32 PM