Indian 2 : ఆ అప్‌డేట్‌ ఏంటి.. శంకర్‌ ఏం చెప్పబోతున్నారు!

ABN , First Publish Date - 2023-10-28T12:34:59+05:30 IST

27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్. ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఇండియన్ (భారతీయుడు) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇండియన్-2 వస్తోంది.

Indian 2 : ఆ అప్‌డేట్‌ ఏంటి.. శంకర్‌ ఏం చెప్పబోతున్నారు!

27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్(Kamal haasan). ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన 'ఇండియన్ (భారతీయుడు-Indian -2) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇండియన్-2 వస్తోంది. 'భారతీయుడు' చిత్రంలో సేనాపతిగా కమల్‌ ఎంతటి పవర్‌ఫుల్‌ రోల్‌ చేశారో.. ఇప్పుడు అంతకుమించి ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారు శంకర్‌. అయితే సినిమా ప్రకటించి ఐదేళ్లు దాటింది. పలు కారణాల చేత షూటింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా శంకర్‌ పూర్తిగా ఈ చిత్రం మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని లోలా వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయిస్తున్నారు.

Indian-2-&2.jpg

తాజాగా ఈ సినిమా లేటెస్ట్‌ అప్‌డేట్‌కు సంబంధించి శంకర్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. ఆదివారం ఈ సినిమాకు సంబంధించి పెద్ద అప్‌డేట్‌ రాబోతుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ అప్‌డేట్‌ ఏంటా? అని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్‌, టీజర్‌ లాంటిది ఏమైనా ప్లాన చేశారా అని నెట్టింట బ్రౌజ్‌ చేయడం మొదలుపెట్టారు. మరి ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే ఆదివారం ఉదయం 11 గంటల వరకూ వేచి చూడాల్సిందే!

ఈ చిత్రంలో కాజల్‌, రకుల్‌, ప్రియా భవానీ శంకర్‌, సిద్దార్థ్‌ గుల్షన గ్రోవర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన స్వరకర్త. లైకా ప్రొడక్షన్స పతాకంపై సుభాస్కరన భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-10-28T12:35:41+05:30 IST