Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఇది సినిమా కాదు.. జీవితం!

ABN , Publish Date - Jun 13 , 2024 | 08:58 PM

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఇది సినిమా కాదు.. జీవితం!
Music Shop Murthy Pre Release Event

అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను (Music Shop Murthy Pre Release Event) మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) మాట్లాడుతూ.. ఓవర్సీస్‌లో మా ‘బేబీ’ సినిమాను హర్ష రిలీజ్ చేశారు. ఆయనకున్న కాన్ఫిడెన్స్‌తోనే మా చిత్రం బయటకు వచ్చింది. ఇది హర్ష సినిమా అని నాకు ముందుగా తెలియదు. మనసుతో, ఇష్టంతో, ప్రేమతో ఈ సినిమాను దర్శకుడు తీశాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. పవన్ గారి సంగీతం నాకు చాలా ఇష్టం. శ్రీనివాస్ గారు చక్కగా చూపించారు. చాందినీ గారు అద్భుతమైన నటి. ఈ చిత్రంతో ఆమెకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అజయ్ ఘోష్‌కు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. ఎలాంటి పాత్రైనా ఆయన నటించగలరు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం


Ajay-Ghosh-Music-Shop-Murth.jpg

ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) మాట్లాడుతూ.. హర్ష ఓవర్సీస్‌లో మా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. టీజర్, ట్రైలర్ చూసి కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎంచుకుంటారు. ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది. అలాంటి ఆయన ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. దర్శకుడు శివ గారితో నాకు నెల నుంచి పరిచయం ఏర్పడింది. కొత్త దర్శకుడిలా అనిపించలేదు. టెక్నికల్‌గా, సౌండింగ్‌ పరంగా ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ నేను సినిమాను చూశా. అజయ్ ఘోష్‌గారు ఏడిపిస్తారు. అన్ని వర్గాల వారిని ఇన్‌స్పైర్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ (Ajay Ghosh Speech).. మా చిన్న చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన సాయి రాజేష్, ధీరజ్ మొగిలినేని థాంక్స్. మా చిత్రాన్ని చూసి రిలీజ్ చేసేందుకు ధీరజ్ ముందుకు వచ్చారు. టాలెంట్‌ను గుర్తించి, భుజం తట్టే వాళ్లు నడిపించే వాళ్లు లేకపోతే ముందుకు వెళ్లలేం. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏం అవ్వాలనుకున్నామో.. ఏం అయ్యామో.. ఏమై మిగిలిపోయామో.. ఈ సినిమా చూసిన తరువాత తెలుస్తుంది. ఈ మూవీ చూసి ఆనందపడతారు. కుమిలిపోతారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ప్రతీ పాత్రతో ఎక్కడో చోట ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఇది సినిమా కాదు.. జీవితం. ఈ సినిమా చూసిన తరువాత ఎవరైనా ఏదైనా సాధిస్తారు. నాలో ఏం చూశాడో కానీ.. నేను ఈ పాత్ర చేయాలని రెండున్నరేళ్లు ఎదురుచూశాడు. నేను కూడా మూర్తి కంటే ఎక్కువ కష్టాలు ఈ ఇండస్ట్రీలో పడ్డాను. ఈ ప్రయాణంలో నా భార్య నాకు ఎంతో అండగా నిలబడింది. ప్రతీ కుటుంబం చూడాల్సిన సినిమా. అన్ని వర్గాల వారికి ఈ చిత్రం నచ్చుతుంది. జూన్ 14న మా సినిమాను అందరూ చూడండని అన్నారు.

చాందినీ చౌదరి (Chandini Chowdary) మాట్లాడుతూ..ప్రతీ మనిషికి ఆశలు, ఆశయాలుంటాయి. కొన్ని చిన్నప్పుడే తెలుస్తాయి. కొన్ని రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. ఇంకొన్ని రియాల్టీకి దూరంగా ఉంటాయి. అలాంటి ఆశలు, ఆశయాలతో ఉండే ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ లక్ష్యం, కల కనడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. పది, పన్నెండేళ్ల క్రితం నేను హీరోయిన్ అవుదామని అనుకున్నా. చాలా మంది నవ్వారు. నేను కూడా నవ్వుకున్న రోజులున్నాయి. కానీ కట్ చేస్తే.. ఒకే రోజు నా రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. వంద మంది ఈ మూవీని చూసి మూర్తిలా ఒక్కరు ఆలోచించినా మాకు విజయం వచ్చినట్టే. ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాని చూడాలని కోరుతున్నానని తెలిపారు.

దర్శకుడు శివ పాలడుగు (Siva Paladugu) మాట్లాడుతూ.. మా చిత్రం అందరికీ వంద శాతం నచ్చుతుంది. 12th ఫెయిల్ సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. అదొక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. లాపతా లేడీస్ అనే సినిమా వచ్చింది. అది కూడా పెద్ద విజయాన్ని సాధించింది. అదొక ఎమోషనల్ డ్రామా. మా చిత్రం కూడా ఇన్‌స్పిరేషనల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. అందరికీ మా చిత్రం నచ్చుతుంది. ఇది చిన్న చిత్రం కావొచ్చు.. కథ, ఎమోషన్, ఆర్టిస్టుల పర్ఫామెన్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.

హర్ష గారపాటి (Harsha Garapati) మాట్లాడుతూ.. ఫ్లై హై సినిమాస్ ద్వారా న్యూజెర్సీలో ‘హృదయకాలేయం’ డిస్ట్రిబ్యూట్ చేశాను. ధీరజ్ గారి ‘బేబీ, అంబాజీపేట’ను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేశాం. వారిద్దరితో నాకు అనుబంధం ఉంది. మా ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన వారిద్దరికీ థాంక్స్. అజయ్ ఘోష్ ఎంతటి నటులో ఈ చిత్రం చూస్తే అందరికీ తెలుస్తుంది. చాందినీ చౌదరికి థాంక్స్. మా చిత్రం జూన్ 14న రాబోతోంది. అందరూ థియేటర్లలో చూడండని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ పవన్, కెమెరామెన్ శ్రీనివాస్, ఎడిటర్ నాగేశ్వర్, దయానంద్ వంటి వారు ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 08:58 PM