Ester Noronha: 10 సంవత్సరాల క్రితం మొదటి హిట్, అసలు విషయం చెప్పేసిన ఎస్తర్..

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:37 PM

విమర్శకులు బాగోలేదని రాసినా నిర్మాత సురేష్ బాబుకి మంచి లాభాలు తెచ్చి పెట్టిన సినిమా 'భీమవరం బుల్లోడు'. సునీల్, ఎస్తర్ నొరోన్హా జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 27, 2014లో విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎస్తర్ కి ఇది రెండో సినిమా, ఆమె ఈ సినిమాలోకి ఎలా వచ్చిందీ అనే విషయాలు ఆమె మాటల్లో...

Ester Noronha: 10 సంవత్సరాల క్రితం మొదటి హిట్, అసలు విషయం చెప్పేసిన ఎస్తర్..
Ester and Sunil from the film Bheemavaram Bullodu

కన్నడ నటి అయిన ఎస్తర్ కి మొదటి పెద్ద విజయం ఇచ్చిన సినిమా 'భీమవరం బుల్లోడు'. ఇది ఆమెకి రెండో సినిమా, సునీల్ ఇందులో కథానాయకుడు, ఉదయ్ శంకర్ దర్శకుడు, దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమా వాణిజ్యపరంగా పెద్ద హిట్ అయింది. చిన్న బడ్జెట్ లో తీసిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో అందరి నోట్లో నానుతూ ఉండేవి. కమెడియన్ గా వున్న సునీల్ కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పుడు చేసిన సినిమా ఇది. ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు పొందలేదు కానీ, వాణిజ్యపరంగా సురేష్ బాబుకి డబ్బులు తెచ్చి పెట్టింది. ఈ సినిమా విడుదలై నేటికీ పది సవంత్సరాలు అయింది, అంటే ఫిబ్రవరి 27, 2014లో విడుదలైంది.

bheemavarambullodu.jpg

ఇందులో కథానాయకురాలిగా చేసిన ఎస్తర్ నొరోన్హా కి ఇది రెండో సినిమా, మొదటి విజయం ఆమె కెరీర్ లో ఇది. ఈ 'భీమవరం బుల్లోడు' సినిమాకి ఆమె ఎలా ఎంపికైంది అనే విషయం గురించి ఆమె చెపుతూ, ఆమె మొదటి సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన '100 అబద్దాలు' అని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసాక దర్శకుడు తేజ ఆ షూటింగ్ రషెస్ రామానాయుడు స్టూడియోలో చూస్తున్నారు.

estersunil.jpg

అప్పుడే నిర్మాత సురేష్ బాబు 'భీమవరం బుల్లోడు' సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, అప్పటికే చాలామందిని తెలిసిన వాళ్ళని, కొత్తవాళ్ళని కూడా ఆడిషన్ చేశారు, కానీ ఎందుకో అతనికి నచ్చలేదు. "రామానాయుడు స్టూడియోస్‌లో '1000 అబద్దాలు' షూటింగ్ సినిమా వీడియో ఎడిట్ అవుతుండగా, సురేష్ సర్ చూసారు. ఆ వీడియోలో ఒకే టేక్‌లో ఏకపాత్రాభినయం చేసిన ఆలయ సన్నివేశానికి అతను ఎంతో ఇంప్రెస్ అయి, వెంటనే తేజ గారితో చెప్పి నన్ను రామానాయుడు స్టూడియోస్‌కి పిలవమని అడిగారు," అని అప్పటి విషయం చెప్పింది ఎస్తర్.

esterbvb.jpg

ఆ వెంటనే నన్ను 'భీమవరం బుల్లోడు'లో కథానాయకురాలిగా తీసుకున్నారు, అది నా రెండవ తెలుగు సినిమా. అప్పట్లో నాకు పెద్దగా ఏమీ తెలియదు, తెలుగు కూడా కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను. కానీ 'భీమవరం బుల్లోడు' విడుదలయ్యాక, ఆ సినిమా విజయంతో నన్ను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది అని చెప్పింది ఎస్తర్. మేము ప్రచారాలకి, అలాగే సినిమా విడుదల తరువాత విజయోత్సవ వేడుకులకు ఆంధ్ర, తెలంగాణ అంతటా పర్యటించాము అని చెపుతూ అప్పుడే నేను ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యాను అని చెప్పింది ఎస్తర్.

bvbester.jpg

ఈ సినిమా వల్ల నేను చాలా మందిని వ్యక్తిగతంగా కలిశాను, తెలుగు ప్రజల సంస్కృతి, వారికి సినిమా మీద వున్న ప్రేమ, వారి ఆహారపు అలవాటు, ఈ సినిమాతో ప్రజలతో ఒక అనుబంధాన్ని పెంచుకున్నాను అని చెప్పింది ఎస్తర్. అందుకే 'భీమవరం బుల్లోడు' నా హృదయానికి దగ్గరగా వుండే సినిమా, నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా అని చెప్పింది ఎస్తర్.

Updated Date - Feb 27 , 2024 | 03:37 PM