Balagam: అందరూ మెచ్చి, ప్రసంశలు అందుకున్న 'బలగం' సినిమా ఓ.టి.టి లో ఎప్పుడు ఎక్కడ అంటే...

ABN , First Publish Date - 2023-03-23T17:04:04+05:30 IST

తెలంగాణ పల్లె జీవనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే సినిమా 'బలగం'. జబర్దస్త్ వేణు దీనికి దర్శకుడు, ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నాయికా నాయికలు. దిల్ రాజు ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ సినిమా త్వరలో చిన్న తెర మీద చూడొచ్చు

Balagam: అందరూ మెచ్చి, ప్రసంశలు అందుకున్న 'బలగం' సినిమా ఓ.టి.టి లో ఎప్పుడు ఎక్కడ అంటే...

జబర్దస్త్ (Jabardasth) షో లో కామెడీ నటుడిగా పేరు తెచ్చుకున్న వేణు (Venu) దర్శకుడిగా తన మొదటి సినిమా 'బలగం' (Balagam) అనే ఒక బలమైన సినిమా తీసాడు. ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ (Dil Raju) బ్యానర్ మీద దిల్ రాజు కూతురు హన్షిత (Hanshitha Reddy), అతని అన్న కుమారుడు హర్షిత్ రెడ్డి (Harshith Reddy) నిర్మించారు. ఈ సినిమా అటు క్రిటిక్స్ చేత, ఇటు ప్రేక్షకుల చేత కూడా శబాష్ అనిపించుకున్న చిత్ర. ఈ చిత్రం తెలంగాణ పల్లె జీవనాన్ని అద్దం పట్టేలా తీసిన వేణు ని ఎందరో ప్రశంసించారు. అలాగే ఈ సినిమా యూనిట్ ని తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (Film Critics Association) కూడా సత్కరించింది. ఇందులో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) కథానాయకులు.

ఈ 'బలగం' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సింప్లీ సౌత్ (Simply South) అనే ఓ.టి.టి ప్లేట్ ఫార్మ్ ల మీద మార్చి 24 వ తేదీన విడుదల అవుతోంది.

balagamreview1.jpg

బలగం కథ: (Balagam story)

'బలగం' (Balagam) కథ తెలంగాణ లోని ఒక గ్రామం లో జరుగుతుంది. కొమరయ్య (సుధాకర్ రెడ్డి) అనే ముసలాయన ఆ గ్రామంలో ప్రతి వాళ్ళనీ పలకరిస్తూ, హాస్యోక్తులు ఆడుతూ, తెల్లవారు జామునే అందరినీ (Balagam on OTT) లేపుతూ తన పొలం కి వెళ్లి వస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొమరయ్య మనవడు (పెద్ద కొడుకు కుమారుడు) శైలు (ప్రియదర్శి) పెళ్లి చేసుకొని (Balagam on OTT) వచ్చిన కట్నం డబ్బుతో అప్పు తీర్చేయాలి అనుకుంటాడు. కానీ తాత కొమరయ్య చనిపోవటం తో పెళ్లి వాయిదా పడుతుంది. కొమరయ్య దహన సంస్కారం అయిపోయాక, 11వ రోజు వరకు ఆ కుటుంబం లో కలతలు, (Balagam on Amazon Prime Video) వాదోపవాదాలు ఇలా జరుగుతూ ఉంటాయి. అల్లుడు, పెద్ద కొడుకు మోహ మొహాలు చూసుకోకుండా కూర్చుంటారు, వాదించుకుంటారు, (Balagam) కొట్టుకుంటారు కూడా. ఇక పిండ కార్యక్రమం లో పిండం పెట్టి కాకి కోసం ఎదురుచూస్తారు. (Balagam on OTT) కాకి వస్తుంది కానీ పిండం ముట్టదు. గ్రామ పెద్దలు కొమరయ్య కి ఏమి కోర్కెలు ఉన్నాయో అవి తీరిస్తే కాకి వచ్చి ముట్టుకుంటుందని కొడుకులకి, అల్లుడికి చెప్తారు. ఇంతకీ కొమరయ్య కి కోర్కెలు ఏమున్నాయి, గ్రామ పెద్దలు కొమరయ్య కుటుంబానికి ఎలాంటి హెచ్చరిక చేశారు, కాకి వచ్చి పిండం తినటానికి ఆ కుటుంబం చివరికి ఏమి చేసింది అన్నదే బలగం కథ.

Updated Date - 2023-03-23T17:04:05+05:30 IST