కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

ABN, Publish Date - Jan 06 , 2024 | 06:01 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ కొట్టి.. జాతీయ అవార్డును గెలుచుకున్న యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేతులు కలిపారు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో వచ్చే క్రేజీ సినిమా RC16 టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా అత్యున్నతంగా ఉండబోతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఇవ్వబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Buchi Babu, AR Rahman and Sukumar

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన తదుపరి చిత్రం కోసం.. తొలి చిత్రం ‘ఉప్పెన’ (Uppena)తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ కొట్టి.. జాతీయ అవార్డును గెలుచుకున్న యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)తో చేతులు కలిపారు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో వచ్చే క్రేజీ సినిమా RC16 టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా అత్యున్నతంగా ఉండబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, అత్యంత భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) నిర్మించనున్నారు.

బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే... ఈ మెగా వెంచర్ కోసం, ఆస్కార్-విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించనున్నారు. అయితే ఈ విషయాన్ని రెహమాన్ ఎప్పుడో ప్రకటించగా.. తాజాగా ఆయన పుట్టినరోజు (AR Rahman Birthday) సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. బుచ్చిబాబు ఉప్పెన మ్యూజికల్ హిట్ అయిన విషయం తెలిసిందే. రెండవ చిత్రం కూడా కచ్చితంగా మ్యూజికల్ చార్ట్‌బస్టర్ కావడం పక్కా.


ఏఆర్ రెహమాన్ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన సంగీత దర్శకుల్లో ఒకరు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులలో మ్యాసీవ్ ఫాలోయింగ్‌ ఆయన సొంతం. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. రెహమాన్ సంగీతం విశ్వవ్యాప్తం. రెహమన్ సంగీతం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రధాన ఆకర్షణగా ప్రేక్షకులని అలరించబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ (Mega Power Star) కోసం బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని.. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Nawazuddin Siddiqui: విక్టరీ వెంకటేష్ నుండి అందరూ అది నేర్చుకోవాలి

****************************

*Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

****************************

*RC16: ట్రెండింగ్‌లో రామ్ చరణ్ ‘RC16’.. ఎందుకో తెలుసా?

***************************

*Kannappa: ‘కన్నప్ప’తో ఆ డ్రీమ్ కూడా తీర్చేసుకుంటున్నారు..

**************************

Updated Date - Jan 06 , 2024 | 06:01 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!