Love Me Movie: అందరి కళ్ళు ఈ అచ్చమైన, అందమైన తెలుగమ్మాయిపైనే !

ABN , Publish Date - May 23 , 2024 | 11:45 AM

'అల వైకుంఠపురంలో' అల్లు అర్జున్ చెల్లెలుగా సహజంగా నటించిన వైష్ణవి చైతన్య, 'బేబీ' సినిమాతో కథానాయకురాలిగా ఆరంగేట్రం చేసి, అదే అల్లు అర్జున్ తో శెభాష్ అనిపించుకుంది. ఇప్పుడు 'లవ్ మీ' అనే సినిమాతో ఈ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకే అందరి దృష్టి ఆమె పైనే వుంది...

Love Me Movie: అందరి కళ్ళు ఈ అచ్చమైన, అందమైన తెలుగమ్మాయిపైనే !
Vaishnavi Chaitanya

ఈమధ్య కాలంలో ఒక తెలుగమ్మాయికి మంచి పేరు వచ్చిందంటే ఆ అమ్మాయి ఒక్క వైష్ణవి చైతన్య అనే చెప్పాలి. 'అల వైకుంఠపురంలో' అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించి 'వాళ్ళు నా చున్నీ ఎత్తుకెళ్లిపోయారురా' అంటూ అల్లు అర్జున్ తో అన్న ఆ సన్నివేశం అందరికీ గుర్తుంది. అదే వైష్ణవి చైతన్య గురించి అదే అల్లు అర్జున్ 'బేబీ' సినిమా విజయోత్సవ సభలో ఎంత గొప్పగా చెప్పారో కూడా అందరికీ తెలిసిన విషయమే. (All eyes are on Vaishnavi Chaitanya as her film Love Me is releasing on May 25)

vaishnavichaitanyaone.jpg

వైష్ణవి చైతన్య 'బేబీ' అనే సినిమాతో తెలుగు పరిశ్రమలో ఒక ప్రకంపనలు సృష్టించింది అనే చెప్పాలి. అటు నటనలోనూ, ఇటు గ్లామర్ లోనూ రెండూ మిళితం చేసి 'బేబీ' లో ఆమె చేసిన అద్బుతమైన ప్రతిభకి అందరూ ఎంతో ప్రశంసించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ముంబై, ఢిల్లీ, తమిళం, మలయాళం ఇలా ఎక్కడినుండో వచ్చి తెలుగురాని కథానాయికలు ఏలుతున్న ఈ సమయంలో అవకాశం ఇస్తే తెలుగు అమ్మాయి ఎంత చక్కటి ప్రతిభను కనబరుస్తుందో చేసి చూపించింది వైష్ణవి. (After a stunning performance in 'Baby', Vaishnavi Chaitanya is now coming up with her second film 'Love Me')

'బేబీ' సినిమాతో విమర్శకుల ప్రశంసలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో యువతని కూడా ఇట్టే ఆకర్షించిన నటి వైష్ణవి చైతన్య. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి ఒక్క సినిమాతో ఎంతో పేరు గడించి ఈరోజు ఆమె కోసమే 'లవ్ మీ' సినిమా చూడటానికి ప్రేక్షకులు వస్తారంటే ఎవరైనా నమ్మగలరా? కానీ అది నిజం. ఇప్పుడు 'లవ్ మీ' సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వైష్ణవి చైతన్య అని మాత్రమే చెప్పాలి అని అంటున్నారు.

vaishnavichaitanyatwo.jpg

'బేబీ' సినిమాలో ఇటు ప్రేమిస్తున్న అబ్బాయిని పక్కన పెట్టి, అటు ఆధునిక పేరుతో ఇంకో అబ్బాయి వెనకాల పడి చివరికి తన జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది అనే ఒక అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది వైష్ణవి. అందుకే ఆమె పాత్రకి ఎక్కువ మార్కులు పడ్డాయి. మిగతా వాళ్ళు కూడా ఆ సినిమాలో బాగా చేశారు, కానీ సినిమా కథ ఎక్కువగా వైష్ణవి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఆమె పాత్రకి ఎక్కువ మార్కులు వచ్చాయి. అలాగే చాలా కాలం తరువాత ఒక తెలుగమ్మాయికి అంత బలమైన పాత్ర రావటం కూడా అరుదనే చెప్పాలి. ఆమె ఆ పాత్రని ఎంతో అద్భుతంగా పోషించి శెభాష్ అనిపించుకుంది. (All eyes are Vaishnavi Chaitanya)

ఇంకొన్ని రోజుల్లో అంటే మే 25న విడుదలవబోతున్న 'లవ్ మీ' సినిమాలో అందరి దృష్టి ఇప్పుడు వైష్ణవిపైనే ఉన్నాయని తెలుస్తోంది. 'బేబీ' సినిమాతో ఒక సంచలనం సృష్టించిన వైష్ణవి, 'లవ్ మీ' లో ఎలాంటి పాత్ర చేస్తోంది, ఆమె ప్రతిభని తెలుగు ప్రేక్షకులకి మరోసారి చూపించే దిశగా ఆ పాత్ర ఉంటుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

vaishnavichaitanyathree.jpg

ఈ సినిమాలో కథానాయకురాలిగా నటించటంతో పాటు, ఒక పాట కూడా పాడింది వైష్ణవి. లెజండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరిస్తే, అయన సంగీత దర్శకత్వంలో వైష్ణవి పాట పాడటం ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్ భీమవరపు, ఛాయాగ్రహణం దేశంలో అత్యంత ప్రతిభావంతుడైన పీసీ శ్రీరామ్. ఇంతమంది పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలతో పనిచేసే అవకాశం తన కెరీర్ ఆరంభంలోనే వైష్ణవికి రావటం నిజంగా ఆమె ప్రతిభకి తార్కాణం. ఆశిష్ రెడ్డి ఈ సినిమాలో కథానాయకుడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 11:45 AM