Manamey: తెలుగులో డబ్బింగ్ చెప్పిన సీరత్ కపూర్

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:39 PM

తెలుగు సినిమాల్లో చాలామంది నటీమణులకు డబ్బింగ్ చెపుతూ వుంటారు, చాలా తక్కువమంది మాత్రమే తమ స్వంత గొంతును ఇస్తారు, అలా స్వంత గొంతు ఇచ్చినవారిలో ఇప్పుడు సీరత్ కపూర్ కూడా చేరింది. తాజాగా విడుదలైన 'మనమే' సినిమాలో సీరత్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది.

Manamey: తెలుగులో డబ్బింగ్ చెప్పిన సీరత్ కపూర్
Seerat Kapoor with director Sriram Aditya

తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ గా వున్న నటీమణుల్లో సీరత్ కపూర్ ఒకరు. ఇటీవల విడుదలైన సినిమా 'మనమే' లో సీరత్ కపూర్ ఒక ప్రత్యేక పాత్రలో కనపడుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ బెలూన్ ఫెస్టివల్ కి బ్రస్సెల్స్ వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ గా సీరత్ కపూర్ పరిచయం అవుతుంది. ఆమెతో ఒక పాటని కూడా సినిమాలో పెట్టాడు దర్శకుడు. సినిమాలో రెండో సగంలో వస్తుంది సీరత్ కపూర్ పాత్ర. (Actress Seeart Kapoor lends her own voice for her role in Telugu cinema Manamey)

seeratkapoortelugu.jpg

అయితే ఈ పాత్ర కోసం సీరత్ తెలుగులో తన స్వంత గొంతు ఇచ్చింది. తెలుగులో ఆమె డైలాగ్స్ కి ఆమె డబ్బింగ్ చెప్పడం ఆసక్తికరం. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర విదేశాల్లో వున్న గైడ్ గా ఉంటుంది కాబట్టి, ఆమె పాత్రకి ఆమే డబ్బింగ్ చెపితే బాగుంటుంది అని ఈ చిత్ర నిర్వాహకులు పట్టుబట్టినట్టుగా తెలిసింది. దానికితోడు ఆమె పోషించిన పాత్రకి వచ్చీ రానీ తెలుగు అయినా పరవాలేదు అని నిర్వాహకులు భావించటంతో ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే ఆమె చెప్పిన డబ్బింగ్ బాగా వచ్చింది. ముందుగా చాలామంది హిందీ నటీమణులకు ఎవరో ఒక డబ్బింగ్ ఆర్టిస్టుతో వాయిస్ ఇప్పించినట్టుగానే సీరత్ కి కూడా చెప్పిద్దామని అనుకున్నారు. కానీ ఎందుకో సీరత్ చెపితే అది చాలా సహజంగా ఉంటుంది అని దర్శకుడు, చిత్ర నిర్మాతలు భావించడంతో ఆమె చేతనే చెప్పించినట్టుగా తెలిసింది.

seeratkapoorteluguone.jpg

ఈ తెలుగు మాటలు చెప్పడానికి సీరత్ ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆమె తన డైలాగ్స్ అన్నీ రాయించుకొని, వాటి అర్థం తెలుసుకొని, ఒక ట్యూటర్ ని కూడా పెట్టుకున్నట్టుగా తెలిసింది. “నేను నటించిన ప్రతి తెలుగు సినిమాలో, చిత్రీకరణ జరిగేటప్పుడు నేను ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్తాను. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నా స్వంత వాయిస్ ఉంచినందుకు, నన్ను నమ్మిన టీముకు కృతజ్ఞతలు," అని చెప్పింది సీరత్. ఈ విషయంతో సీరత్ తను చెయ్యబోయే ప్రతి పాత్ర కోసం ఎంతటి నిబద్దత, అకుంఠిత దీక్ష పాటిస్తుంది అనేది అర్థం అవుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.

Updated Date - Jun 10 , 2024 | 04:42 PM