Seerat Kapoor: బాబోయ్ ! ఏంటి అలా అయిపోయింది !

ABN , First Publish Date - 2023-04-19T13:41:59+05:30 IST

'రన్ రాజా రన్' సినిమా తో తన కెరీర్ ప్రారంభించిన సీరత్ కపూర్, గత సంవత్సరం హిందీలో కూడా మొదటి సినిమా చేసింది. ఇప్పుడు ఈ భామ తన సాంఘీక మాధ్యమంలో చురుకుగా ఉంటూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేసింది

Seerat Kapoor: బాబోయ్ ! ఏంటి అలా అయిపోయింది !

సీరత్ కపూర్ (Seerat Kapoor) తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం వున్న నటి. 'రన్ రాజా రన్' (Run Raja Run) సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన సీరత్ కపూర్ తరువాత చాలా తెలుగు సినిమాలలో నటించింది. మొదటి సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. శర్వానంద్ (Sharwanand) ఇందులో లీడ్ యాక్టర్ అయితే, అతని పక్కన సీరత్ కపూర్ చేసింది. ఇంకో ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా 'ఓజి' (OG) కి దర్శకత్వం వహిస్తున్న సుజీత్ (Sujeeth) ఈ 'రన్ రాజా రన్' కి దర్శకుడు, అతనిది మొదటి సినిమా.

seeratkapoor.jpg

ఆలా మొదలెట్టిన సీరత్ కపూర్ తరువాత 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'టచ్ చేసి చూడు', 'టైగర్' లాంటి సినిమాలు ఎన్నో చేసింది. తాను చేసిన సినిమాలు అందులోని పాత్రలు అన్నీ తన స్వంతం నిర్ణయాలనే చెప్తోంది సీరత్. ఎందుకంటే తనకు తెలుసు ఎటువంటి సినిమాలు చెయ్యాలో, అందుకే తన కెరీర్ ని వెనక్కి తిరిగి చూస్తే కనక, నేను పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయని, ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందని నాకు అనిపిస్తుంది

seeratkapoor1.jpg

ప్రయోగాలు చేయడం గురించి చెపుతూ, సాధారణంగా జీవితం గురించి ఓపెన్ మైండెడ్‌గా ఉంటాను. నేను తీసుకున్న నిర్ణయాలు సరియైనవే అని నేను భావించి, ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించను. ఏదైనా జరగాల్సిన సమయంలో జరిగిందని నేను భావిస్తున్నాను, అని చెప్పింది సీరత్.

seeratkapoor2.jpg

గత సంవత్సరం సీరత్ కపూర్ 'మార్రిచ్' (Maarrich) అనే హిందీ సినిమా తో హిందీలో డెబ్యూ అయింది. ఈ సినిమా గురించి చెపుతూ, ఇది ఒక బోల్డ్ డెబ్యూ అని అనింది. "కానీ నేను సినిమాల్లో వాస్తవికతను చూపించే పాత్రలలో కనిపించాలని అనుకుతున్నాను," అని చెప్పింది. ఈ సినిమాకి ధృవ్ లాతెర్ (Dhruv Lather) దర్శకుడు కాగా, తుషార్ కపూర్ (Tusshar Kapoor) కథానాయకుడుగా వేసేది, అలాగే నిర్మాతల్లో ఒకడు కూడా.

Updated Date - 2023-04-19T13:42:06+05:30 IST