Aadi Saikumar: ‘టాప్ గేర్’లో దూసుకెళుతోన్న హీరో

ABN , First Publish Date - 2022-12-23T22:43:55+05:30 IST

‘ప్రేమ కావాలి’ (Prema Kavali) అంటూ కెమెరా ముందుకొచ్చి.. తన తండ్రి సాయికుమార్‌ (Sai Kumar)లానే విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల

Aadi Saikumar: ‘టాప్ గేర్’లో దూసుకెళుతోన్న హీరో
Aadi Saikumar

‘ప్రేమ కావాలి’ (Prema Kavali) అంటూ కెమెరా ముందుకొచ్చి.. తన తండ్రి సాయికుమార్‌ (Sai Kumar)లానే విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆది.. హీరోగా వైవిధ్య భరితమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఓ పేరును లిఖించుకున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది సాయికుమార్ (Aadi Saikumar). ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా.. పలు వైవిధ్యభరితమైన రోల్స్ చేసి వెండితెరపై మ్యాజిక్ చేశారు. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వినోదం పంచుతూ దర్శక నిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్నారు.

top.jpg

ఇక 2022 ఏడాది మొత్తం కూడా బాక్సాఫీస్ వద్ద ఆది సాయి కుమార్ ట్రెండ్ కనిపించింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేశారాయన. టాలీవుడ్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ పెంచుకున్న ఆది సాయి కుమార్.. నేటితరం ఆడియన్స్ టేస్ట్ తెలిసిన హీరోగా ప్రతి సినిమాలో కూడా తన నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం తెలుగులో ‘టాప్ గేర్’ అనే సినిమా చేస్తున్నారు ఆది సాయికుమార్. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కాబోతోంది. డిసెంబర్ 23 ఆది సాయికుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని ‘టాప్ గేర్’ (Top Gear) టీమ్ ఆయనకు స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపింది. ‘టాప్ గేర్’‌తో పాటు ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్ ఉన్నాయి.

Updated Date - 2022-12-23T22:45:58+05:30 IST