Hrithik Roshan: హృతిక్ రోషన్‌ బర్త్‌డే.. సెలబ్రేషన్స్‌తో దుమ్మురేపిన ఫ్యాన్స్

ABN , Publish Date - Jan 11 , 2024 | 04:06 PM

జనవరి 10న బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన పేరు‌ను ట్రెండ్ అయ్యేలా చేశారు. అంతేకాదు, కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా తమ అభిమాన హీరో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Hrithik Roshan: హృతిక్ రోషన్‌ బర్త్‌డే.. సెలబ్రేషన్స్‌తో దుమ్మురేపిన ఫ్యాన్స్
Hrithik Roshan Birthday Celebrations

జనవరి 10న బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తన 50వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన పేరు‌ను ట్రెండ్ అయ్యేలా చేశారు. అంతేకాదు, కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు తమిళనాడు (Tamil Nadu)లో కూడా తమ అభిమాన హీరో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

Hrithik-3.jpg

హృతిక్ రోషన్ పుట్టినరోజు (Hrithik Roshan Birthday)ను పురస్కరించుకుని అభిమానులు చేసిన పలు సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా అభిమానులు హైదరాబాద్‌లో, విజయవాడలో మరియు వైజాగ్‌లో ఉన్న కొన్ని అనాథశ్రమాలలో ఫుడ్ డొనేట్ చేశారు. అలాగే మంగళగిరి, వైజాగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అభిమానులు మొక్కలు నాటి అభిమానం చాటుకున్నారు. చెన్నై సిటీలో అలాగే హైదరాబాద్, విజయవాడ సిటీలలో కేక్ కటింగ్ చేశారు. (Hrithik Roshan Birthday Celebrations)


Hrithik-1.jpg

చెన్నై సిటీలో అయితే ట్రక్‌లో ఫుడ్‌ను డిస్ట్రిబ్యూషన్ చేశారు ఫ్యాన్స్. అలాగే కొంతమంది ఫ్యాన్స్ హృతిక్ రోషన్ హిట్ సాంగ్స్‌కు డాన్స్ చేశారు. తమ అభిమాన హీరో సినిమా ‘ఫైటర్’ (Fighter) జనవరి 25న విడుదల అవుతున్న సందర్భంగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటూ.. హృతిక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Hrithik-2.jpg


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: ‘హను-మాన్’ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ఇచ్చారంటే..

**********************

*Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే

***********************

*King Nagarjuna: రాసిపెట్టికోండి.. కిష్టయ్య బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు

*************************

*Deviyani Sharma: ఆ హీరో సరసన నటించాలన్నదే నా జీవితాశయం

***************************

*Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..

***********************

Updated Date - Jan 11 , 2024 | 04:06 PM