మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

ABN, Publish Date - Mar 20 , 2024 | 10:48 AM

మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులను ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. ఇంతకు ముందు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’లా.. ఇప్పుడు షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’తో చూపించబోతోన్నారు.

Ashwatthama The Saga Continues

మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులను ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. ఇంతకు ముందు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ (Hanuman)లా.. ఇప్పుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ (Ashwatthama The Saga Continues)తో చూపించబోతోన్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోబోతోంది.

ఈ చిత్రం మహాభారతంలోని చిరంజీవి అయిన ఓ యోధుడు (అశ్వత్థామ) కథను చెప్పబోతోంది. ఇప్పటికీ అశ్వత్థామ (Ashwatthama) బతికే ఉన్నారని నమ్ముతుంటారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, అద్భుతమైన సామర్థ్యాలతో పరిగెడుతున్న ఈ ప్రస్తుత యుగంలో, అశ్వత్థామ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతోన్నారు. అమర జీవిగా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను కూడా ఇందులో చూపించబోతోన్నారని తెలుస్తోంది. ఇది గతం, వర్తమానం మధ్య జరిగే యుద్దం అని మేకర్స్ చెబుతున్నారు. హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో సినిమాను అద్భుతంగా తీర్చి‌దిద్దబోతోన్నామని.. ఈ సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కిస్తామని తెలుపుతున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత జాకీ భగ్నాని (Jackky Bhagnani) మాట్లాడుతూ.. మేము చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తాం. ప్రేక్షకుల హృదయాలు, మనస్సులపై శాశ్వత ప్రభావాన్ని చూపించేలా ఉండాలని చూస్తాం. ‘బడే మియా చోటే మియా’ తర్వాత, నేను ఊహించని సినిమా చేయాలనుకున్నాను. ఇది మనందరికీ తెలిసిన కథ. ఈ కథపై ప్రస్తుత ఆధునిక కాల పరిస్థితులు, వాటి వల్ల ఆ లెజెండ్ చేయాల్సి వచ్చిన యుద్ధం ఏంటన్నది ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుందని తెలిపారు. దర్శకుడు సచిన్ రవి (Sachin Ravi) మాట్లాడుతూ.. “నాకు అమరత్వం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇందులో చాలా భావోద్వేగాలు, నాటకీయ దృశ్యాలను రేకెత్తించే ఆస్కారం ఉంటుంది. మహాభారతంలోని అశ్వత్థామ ఈనాటికీ జీవిస్తున్నాడని నమ్ముతుంటారు. అతను అమరజీవి అని భావిస్తుంటాం. అతని కథనాన్ని లోతుగా పరిశోధించాలనే నా కోరికకు ఆజ్యం పోసింది. నా లక్ష్యం ఈ కథకు ప్రాణం పోసి, ప్రస్తుత కాలక్రమంలో అతనిని ఉంచడం.. అమర జీవి యొక్క సంక్లిష్టమైన మనస్తత్వం ఎలా ప్రభావితం అవుతుంది.. అతను వేల సంవత్సరాలుగా చూసిన ప్రపంచాన్ని అతను ఎలా గ్రహించాడో అన్వేషించడం అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. నేను అతని కథను భారీ ఎత్తున, మునుపెన్నడూ చూడని యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ (Pooja Entertainment) బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లు నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే థియేటర్‌లలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

*************************

*Kanguva: రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌.. చూడాల్సిందే

************************

*Ustaad Bhagat Singh: ‘భగత్స్ బ్లేజ్’.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం

********************

Updated Date - Mar 20 , 2024 | 10:48 AM