Simhadri4K: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి 4K’ రీ రిలీజ్ అధికారిక ప్రకటన, వీడియో వచ్చేసింది..

ABN , First Publish Date - 2023-04-09T21:44:03+05:30 IST

తారక్‌ని మాస్, క్లాస్ అనే తేడా లేకుండా మావాడు అనుకునేలా.. ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమాను 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేసేందుకు

Simhadri4K: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి 4K’ రీ రిలీజ్ అధికారిక ప్రకటన, వీడియో వచ్చేసింది..
Jr NTR Simhadri Still

20 ఏళ్ల కుర్రాడు కేరళ (Kerala)లోని త్రివేండ్రం నడిబొడ్డున నిలబడి తొడగొడితే.. అక్కడి ప్రజలు సింగమలై అన్నగా దేవుడిని చేశారు. ఒక తెలుగువాడిని కేరళ ప్రజలు దేవుడిగా చూస్తుంటే.. అంతా ఆశ్చర్యపోయారు. నూనూగు మీసాల మీద ఒట్టేసి మరీ రికార్డులను కొల్లగొట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్‌ (Man of the Masses NTR)గా మారి గ్లోబల్ రేంజ్‌లో తన తడాఖా చూపేందుకు సిద్ధమవుతున్న వేళ.. మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సింగమలై వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), దర్శకధీర రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సింహాద్రి’ (Simhadri 4K). ఈ సినిమా థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు రికార్డ్ థియేటర్లలో ప్రదర్శించబడి.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తారక్‌ని మాస్, క్లాస్ అనే తేడా లేకుండా మావాడు అనుకునేలా.. ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమాను 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను, టీజర్ కట్ వీడియోను అధికారికంగా విడుదల చేశారు.

Jr-NTR-2.jpg

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Global Star NTR) పుట్టినరోజును పురస్కరించుకుని.. మే 20వ తేదీన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. అంతే కాదు, ఓ గ్లిమ్స్ వీడియోని కూడా విడుదల చేశారు. సరికొత్త సౌండింగ్‌తో, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ట్యాగ్‌తో ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది. ఈ వీడియో, విడుదల తేదీ ప్రకటన సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ‘సింహాద్రి 4K’ (#Simhadri4K) ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. మధ్యలో ఈ వీడియో విడుదల కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఫ్యాన్స్ ట్రెండ్ విషయంలో మాత్రం తగ్గలేదు. ఇంకా ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. చూస్తుంటే ఎన్టీఆర్ బర్త్‌డే (NTR Birthday Special) వరకు ఈ ట్యాగ్ ఇలానే ట్రెండ్ అవుతుందేమో అనేలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు.

Jr-NTR.jpg

2003 జూలై 9వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని విజయ మారుతి క్రియేషన్స్ (Vijay Maruthi Creations) పతాకంపై వి. దొరస్వామి రాజు (V Doraswamy Raju) నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 20 ఏళ్లకు చేరుకున్న సందర్భంగానూ, అలాగే ఎన్టీఆర్ గ్లోబల్‌గా పేరు సంపాదించుకున్న విశేషాన్ని పురస్కరించుకుని నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans) ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరారు. దీంతో చిత్రాన్ని 4K వెర్షన్‌లో రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత (Oscar Winner) ఎమ్. ఎమ్. కీరవాణి (MM Keeravani) సంగీతం అందించారు. పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడా పాటలు 4Kలో.. అలాగే డాల్బీ అట్మాస్‌లో తెరపై కనిపిస్తే.. ఫ్యాన్స్ తట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న మనే. చూద్దాం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) మే 20న చేసే రచ్చ ఏం రేంజ్‌లో ఉండబోతుందో..


ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-09T21:47:14+05:30 IST