Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

ABN , First Publish Date - 2023-04-09T20:12:47+05:30 IST

ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..
Allu Aravind

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం.. మరోసారి తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కి చేర్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) నటనకు అంతా ఫిదా అయ్యారు. వీరిద్దరి కలిసి డ్యాన్స్ చేసిన ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జాబితాలో ఆస్కార్ అవార్డ్ (Oscar Award) వరించిన విషయం తెలిసిందే. ప్రపంచవేదికపై సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani), పాట రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అవార్డును అందుకుని.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆస్కార్ అవార్డు వేడుక అనంతరం ఇటీవలే ఇండియాకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) గ్రాండ్‌గా సత్కరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను చిరు సన్మానించారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ఇండస్ట్రీ తరపున నన్ను మొదటిగా మాట్లాడమని చెప్పినందుకు హ్యాపీ. ఆస్కార్.. అది ఎక్కడో ఉంటది. అది సాధ్యమైన విషయం కాదు. మనం కల కూడా కనలేని అవార్డ్ అది. నేను 10 సంవత్సరాల క్రితం అమెరికా (USA) వెళ్లినప్పుడు.. మనం ఎలాగూ ఆస్కార్ తీసుకోలేము.. కనీసం ఆస్కార్ ఇచ్చే హాలు ఎలా ఉంటుందో చూద్దామని వెళ్లి.. అబ్బ ఇక్కడేనా ఆస్కార్ తీసుకునేది అని అనుకుని సంతోషించాను. కానీ ఇవాళ మనమంతా గర్వించేలా.. మన రాజమౌళి అండ్ యూనిట్.. ఆ హాల్లో కూర్చుని.. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, నా మేనల్లుడు రామ్ చరణ్, మన లవ్‌బుల్ హీరో ఎన్టీఆర్.. వీళ్లందరినీ అక్కడ చూస్తుంటే కడుపునిండి పోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత సాధించింది అనే దానికి ఒక కొలమానం లేదు కానీ.. ఈ రోజు ఆ కొలమానం ఏర్పడిందని అనిపించింది. ఎవరూ ఊహించలేనంత ఎత్తులో ఈరోజు ఇండస్ట్రీ ఉంది.

ఇక్కడ కీరవాణి‌గారి గురించి ఓ విషయం చెప్పాలి. ‘క్షణక్షణం’ ఆడియో లాంఛ్‌కి ఎమ్‌.ఎస్. రెడ్డిగారు ముఖ్య అతిథి. ఆయన ఆ రోజు.. పాటలు చాలా బాగున్నాయి.. ఎవరీ కీరవాణి అన్నారు. అక్కడ మొదలైన కీరవాణి.. ఈ రోజు ప్రపంచం అంతా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే స్థాయికి చేరుకున్నారు. అక్కడ వరకు తీసుకెళ్లారు. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే ఓ స్టూడెంట్.. ఇండస్ట్రీకి వచ్చి పాటలు రాయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఇండస్ట్రీల చుట్టూ తిరిగిన ఓ కుర్రాడు, ఇలా కాదు అలా రాయ్ అని మేము దబాయించిన కుర్రాడు.. ఈ రోజు చిటారు కొమ్మన ఉన్న మామిడికాయను కోసుకొచ్చినట్లు ఆస్కార్‌ను పట్టుకొస్తే.. ఎంత ముచ్చటగా ఉంది. వీరంతా.. మన మనసుల్లో చాలా స్ట్రాంగ్ వేసుకున్న తలుపులను బద్దలు కొట్టి.. ఇది సాధించగలిగినదే.. ఎవరైనా సాధించవచ్చు.. అని యావత్ భారతదేశానికి చాటి చెప్పారు. ఈ రోజు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది. అంతటి స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా.. ఆస్కార్‌ను కూడా తీసుకొచ్చిన రాజమౌళికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగువాడి జెండా ఎక్కడో ఎగరేసేలా చేసిన నా దర్శకుడు.. ఆయనతో ‘మగధీర’ (Magadheera) తీశానని ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. రాజమౌళి, నేను నిర్మించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి, నాకు 40కి పైగా పాటలు రాసిన చంద్రబోస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా మొత్తం యూనిట్‌కి నా వందనాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. (Allu Aravind Speech at RRR Oscar Celebrations)


ఇవి కూడా చదవండి:

*********************************

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-09T20:32:01+05:30 IST