SS Rajamouli: సూపర్ స్టార్ కోసం జక్కన్న వేట మొదలైందా.. ఆ ఫొటోలకు అర్థం అదేనా?

ABN , First Publish Date - 2023-08-19T16:47:32+05:30 IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చేయబోయే చిత్రంపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘ఇండియానా జోన్స్’ తరహా గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీని.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాజమౌళి తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఆయన తన భార్యతో కలిసి పల్పిట్ రాక్‌‌ను సందర్శిస్తోన్న ఫొటోలను షేర్ చేయగా.. ఆ ఫొటోలను చూసిన వారంతా తన తదుపరి సినిమా లొకేషన్స్ వేట మొదలైందనేలా కామెంట్స్ చేస్తున్నారు.

SS Rajamouli: సూపర్ స్టార్ కోసం జక్కన్న వేట మొదలైందా.. ఆ ఫొటోలకు అర్థం అదేనా?
SS Rajamouli with His Wife

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తదుపరి చేయబోయే చిత్రంపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)తో ‘ఇండియానా జోన్స్’ తరహా గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీని.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాజమౌళి తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి అండ్ టీమ్ బిజీబిజీగా ఉంది. తాజాగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోలతో.. మరోసారి SSMB29 చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది. ఈ ఫొటోలలో తన భార్య రమా రాజమౌళి (Rama Rajamouli)తో కలిసి పల్పిట్ రాక్‌ను దర్శిస్తున్నారు రాజమౌళి.


అంతే.. అంతా మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న లొకేషన్స్ సెర్చ్ మొదలెట్టారు అన్నట్లుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోలు పెట్టిన రాజమౌళి.. ‘‘మగధీర (Magadheera) సినిమా కోసం రీసెర్చ్‌ చేస్తున్నప్పుడు ఈ పల్పిట్ రాక్‌ (Pulpit Rock)ను చూశాను. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను.. కానీ కుదరలేదు. ఇప్పుడు స్టావెంజర్‌లో జరగనున్న ‘బాహుబలి’ ఫిల్మ్‌ కన్సర్ట్‌ ద్వారా ఆ కోరిక తీరింది. ‘బాహుబలి’ ఫిల్మ్‌ కన్సర్ట్‌ కారణంగానే నేను ఈ ప్రాంతాన్ని సందర్శించగలిగాను’’ అని ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. నిజంగా వారున్న పల్పిట్‌ రాక్‌‌ని చూస్తుంటే.. మహేష్ బాబు (Mahesh Babu)‌తో తెరకెక్కించబోతున్న సినిమా నేపథ్యానికి సరిపడే లొకేషన్‌లానే అనిపిస్తుంది. అందుకే అంతా.. లొకేషన్ వేట మొదలైందనేలా అనుకుంటున్నారు.


అంతకుముందు దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ‌తో ఉన్న ఫొటోని జక్కన్న షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘‘లండన్‌ లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌ (Royal Albert Hall in London)‌లో జరిగిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ (Baahubali: The Beginning) ప్రదర్శనను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్లముందే కదలాడుతున్నాయి. ఇప్పుడు నార్వేలోని స్టావెంజర్‌ ఒపెరా హౌస్‌లో ‘బాహుబలి 1’ కన్సర్ట్‌ (Concert screening of Baahubali-1 in Norway) జరగనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్టావెంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా (Stavanger Symphony Orchestra) సారథ్యంలో ఈ ప్రదర్శన జరగనుంది’’ అని జక్కన్న తన పోస్ట్‌లో తెలిపారు. కాగా.. ఆగస్ట్ 18న ఈ కన్సర్ట్ చాలా గ్రాండ్‌గా జరిగినట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?

***************************************

*Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?

***************************************

*Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..

***************************************

*Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు

****************************************

*Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం

***************************************

Updated Date - 2023-08-19T16:47:32+05:30 IST