Prabhas: శత శతమానం భవతి.. ‘కన్నప్ప’ టీమ్ ‌గ్రాండ్‌గా విషెస్

ABN , First Publish Date - 2023-10-23T15:43:30+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ‘కన్నప్ప’ టీమ్ గ్రాండ్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డేని పురస్కరించుకుని.. సోషల్ మీడియాలో ప్రభాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు ఆయన నటిస్తోన్న సినిమాల మేకర్స్ స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలియజేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’‌లో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

Prabhas: శత శతమానం భవతి.. ‘కన్నప్ప’ టీమ్ ‌గ్రాండ్‌గా విషెస్
Prabhas and Manchu Vishnu

రెబల్ స్టార్ ప్రభాస్‌ (Reble Star Prabhas)కు ‘కన్నప్ప’ (Kannappa) టీమ్ గ్రాండ్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డేని పురస్కరించుకుని.. సోషల్ మీడియాలో ప్రభాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు ఆయన నటిస్తోన్న సినిమాల మేకర్స్ స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలియజేశారు.. తెలియజేస్తున్నారు. డైనమిక్ స్టార్ మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’‌లో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ‘కన్నప్ప’ టీమ్ కూడా ప్రభాస్‌కు స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సినిమాలలోని పిక్స్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

‘‘ప్రభంజనమై ప్రేక్షక హ‌ృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి, శత శతమానం భవతి’’ (Special Birthday Wishes to Prabhas) అంటూ కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను ‘కన్నప్ప’ టీమ్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ నటించిన సినిమాలలోని ఫొటోలతో పాటు శుభాకాంక్షలు తెలిపిన తీరు ప్రభాస్ ఫ్యాన్స్‌కి యమా నచ్చేసింది. అందుకే ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు.


Prabhas.jpg

‘కన్నప్ప’ విషయానికి వస్తే.. ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో ఈ సినిమాలో భాగస్వామి అవుతుండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ ఇండస్ట్రీ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే ఈ సినిమాలో భాగమవుతున్నట్లుగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా పలువురు స్టార్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారనేలా కూడా వార్తలు వస్తుండటంతో.. నేషనల్ వైడ్‌గా ఈ సినిమాపై హైప్ ఏర్పడుతోంది. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ ‘కన్నప్ప’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతోంది. కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. (Team Kannappa Extends Birthday Wishes to Prabhas)


ఇవి కూడా చదవండి:

============================

*Dhanraj: దర్శకుడిగా ధనరాజ్.. స్టార్ యాక్టర్‌తో సినిమా ప్రారంభం

*****************************************

*Poonam Kaur: నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లోకి చేరాలనుకుంటున్నా..

********************************************

*Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

*************************************

Updated Date - 2023-10-23T15:43:39+05:30 IST