Dhanraj: దర్శకుడిగా ధనరాజ్.. స్టార్ యాక్టర్‌తో సినిమా ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-22T22:53:21+05:30 IST

జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్స్‌లో ఇప్పుడు మరో కమెడియన్, నటుడు ధనరాజ్ కూడా దర్శకుడిగా మారుతున్నాడు. ఇంతకు ముందు వేణు ‘బలగం’ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు ఎన్నో అవార్డులు వరించాయి. ఇప్పుడు ధనరాజ్ కూడా మెగా ఫోన్ పట్టి.. స్టార్ యాక్టర్ సముద్రఖనిని డైరెక్ట్ చేయబోతున్నాడు.

Dhanraj: దర్శకుడిగా ధనరాజ్.. స్టార్ యాక్టర్‌తో సినిమా ప్రారంభం
Dhanraj Film Opening

జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్స్‌లో ఇప్పుడు మరో కమెడియన్, నటుడు ధనరాజ్ (Dhanraj) కూడా దర్శకుడిగా మారుతున్నాడు. ఇంతకు ముందు వేణు ‘బలగం’ (Balagam Venu) సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు ఎన్నో అవార్డులు వరించాయి. ఇప్పుడు ధనరాజ్ కూడా మెగా ఫోన్ పట్టి.. ఓ స్టార్ యాక్టర్‌ కమ్ దర్శకుడిని డైరెక్ట్ చేయబోతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ (Slate Pencil Stories) బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక (Prabhakar Aripaka) సమర్పణలో పృథ్వి పొలవరపు (Prudhvi Polavarapu) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ యాక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం హీరో శివ బాలాజీ క్లాప్ కొట్టగా.. ‘సోలో బతుకే సో బెటర్’ డైరెక్టర్ డైరెక్టర్ సుబ్బు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు ‘బలగం’ వేణు డైరెక్షన్ చేశారు. ‘అమిగోస్’ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయగా.., ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్‌ను యూనిట్ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్, భూపాల్, పృథ్వీ, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. (Dhanraj Turns Director)


Dhanraj-Movie.jpg

తండ్రి కొడుకులుగా సముద్రఖని (Samuthirakani), ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, పృథ్వీ, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ‘విమానం’ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో.. తండ్రి కొడుకుల ఎమోషన్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ‘శశి’ చిత్ర సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Poonam Kaur: నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లోకి చేరాలనుకుంటున్నా..

********************************************

*Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

*************************************

*Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

**************************************

Updated Date - 2023-10-22T22:53:21+05:30 IST