Sai Pallavi: సాయిపల్లవి ఎంటరైంది..

ABN , Publish Date - Dec 29 , 2023 | 09:23 PM

యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘తండేల్’ వరల్డ్ నుండి తాజాగా హీరోయిన్ స్నీక్ పీక్‌ను విడుదల చేశారు మేకర్స్.

Sai Pallavi: సాయిపల్లవి ఎంటరైంది..
Sai Pallavi in Thandel

యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti), ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ (Thandel) ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది. షూటింగ్ ఇప్పుడు గోకర్ణకు షిఫ్ట్ అయ్యింది. ఈ చిత్రంలో చైతూ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె టీంలో జాయిన్ అయ్యింది.

ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని చూడబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ‘తండేల్’ వరల్డ్ నుండి హీరోయిన్ స్నీక్ పీక్ (Sneak Peek Of Sai Pallavi) విడుదల చేశారు. ఈ ఇమేజ్‌లో సాయి పల్లవి బీచ్‌లో నిలబడి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అందమైన పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి ఇందులో నటిస్తున్నట్లుగా ఈ పిక్ చూస్తుంటే అర్థమవుతోంది.


Sai-Pallavi-Thandel.jpg

యదార్థ సంఘటనల కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూట్ ప్రారంభించే ముందు టీమ్ ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. నాగ చైతన్య తన పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు. అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Rock Star Devi Sri Prasad) తన సౌండ్‌ ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ ప్రేమకథను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్‌ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్‌గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Right: ఇయర్ ఎండింగ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ సందడి.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే!

****************************

*Vijayakanth: రియల్ హీరో విజయకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా? కెప్టెన్‌ స్మృతిలో రాష్ట్రం

***************************

*Hansika: హన్సిక 105 నిమిషాలతో రెడీ అవుతోంది.. ఈసారి ఏం చేస్తుందో?

*************************

*Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

**************************

Updated Date - Dec 29 , 2023 | 09:23 PM