Rashmika Mandanna: ‘యానిమల్’ నుంచి నేషనల్ క్రష్ లుక్కొచ్చింది

ABN , First Publish Date - 2023-09-23T12:07:59+05:30 IST

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యానిమల్’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఎక్జయిటింగ్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని రష్మిక మందన్నా లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో గీతాంజలిగా రష్మిక నటించనుంది.

Rashmika Mandanna: ‘యానిమల్’ నుంచి నేషనల్ క్రష్ లుక్కొచ్చింది
Rashmika Mandanna in Animal

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యానిమల్’ (Animal). ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఎక్జయిటింగ్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్.. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ (Anil Kapoor) లుక్‌ని కూడా మేకర్స్ పరిచయం చేశారు. ఇందులో బల్బీర్ సింగ్‌గా అనిల్ కపూర్ నటిస్తున్నారు. అతని ఫస్ట్ లుక్ టెర్రిఫిక్‌గా వుండి.. టాప్‌లో ట్రెండ్ అవుతుండగానే.. మేకర్స్ తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (National Crush Rashmika Mandanna) లుక్‌ని కూడా వదిలారు.

ఇందులో రష్మిక మందన్నా.. గీతాంజలి (Geetanjali) పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. నిండైన చీరకట్టులో ఉన్న ఆమె లుక్‌ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆమె ఏదో ధ్యానంలో ఉన్నట్లుగా చాలా కూల్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే రష్మిక మందన్నా (Rashmika Mandanna) పేరు కూడా వరల్డ్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Rashmika.jpg

‘యానిమల్’ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు.. వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్, విజనరీ రచయిత-దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని కలిపే ఒక క్లాసిక్ సాగా. ఈ గ్రాండ్ వెంచర్ వెనుక ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వున్నారు. రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ వంటి భారీతారాగణం ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్‌లో వుంది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్‌ని అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న (Animal Release Date) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Vishal: న్యాయస్థానం కంటే గొప్ప వ్యక్తిగా భావించొద్దు.. విశాల్‌కు హైకోర్టు చురకలు

**************************************

*Devil: ‘డెవిల్’లోని ‘మాయే చేసి’ పాట కోసం ఎలాంటి వాయిద్యాలు వాడారో చూశారా?

**************************************

*Kumari Srimathi: నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్

************************************

*Producer Atluri Narayana Rao: అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టిన బాబును వెంటనే రిలీజ్ చేయాలి

*************************************

Updated Date - 2023-09-23T12:09:04+05:30 IST