Upasana: కుమార్తెతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల క్రిస్మస్ పండగ, ఫోటోస్ వైరల్

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:48 PM

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ పాప క్లీంకార తో క్రిస్మస్ పండగ జరుపుకోవటమే కాకుండా, ఈ పండుగకు మెగా కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు కూడా హాజరయినట్టు తెలుస్తోంది. ఉపాసన పోస్ట్ చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

Upasana: కుమార్తెతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల క్రిస్మస్ పండగ, ఫోటోస్ వైరల్
Upasana Kamineni and Ram Charan with their daughter Klin Kara

రామ్ చరణ్ (Ram Charan and Upasana Kamineni celebrated Christmas festival with their child Klin Kaara), ఉపాసన కామినేని దంపతులు గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది. ఎందుకంటే ఎక్కడ చూసిన రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కలిసి వెళ్లడం, కలిసి వస్తూ ఉండటం, తమ పాపను చక్కగా ఇద్దరూ చూసుకుంటూ ఉండటం, ఆమెతో ఎక్కువ టైము స్పెండ్ చేస్తూ ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ చాలామంది దంపతులకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాగే ఇద్దరూ తమ వ్యక్తిగత పనులతో ఎంతో బిజీగా ఉంటూ కూడా పాప క్లీంకార కోసం ఇద్దరూ తమ కాలాన్ని వెచ్చిస్తున్నారు.

alluarjunandramcharan.jpg

అలాగే పండగలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నారు, అందుకే వీళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అనే కాకుండా, బెస్ట్ పేరెంట్స్ అని కూడా అందరూ అంటున్నారు. నిన్న క్రిస్మస్ పండగ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ తమ పాపతో ఈ పండగని ఆనందంగా జరుపుకున్నారు.

upasananamrata.jpg

ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. అందులో రామ్ చరణ్, ఉపాసన పాపతో వున్న ఫోటోస్ కాకుండా, అల్లు అర్జున్, స్నేహ దంపతులతో వున్న ఫోటోస్ కూడా షేర్ చేశారు. అలాగే మెగా కుటుంబానికి సంబదించిన అందరితో క్రిస్మస్ పండగ ఎంత బాగా చేసుకున్నారు అన్న విషయం కూడా చెప్పడానికి అందరితో ఒక ఫోటో షేర్ చేశారు. స్నేహితురాలు అయిన నమ్రత శిరోద్కర్ తో కూడా వున్న ఫోటోని షేర్ చేశారు ఉపాసన. కుమార్తెతో వున్న ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది అని అంటున్నారు.

ramcharanupasanaklinkara.jpg

ఇవి కూడా చదవండి:

Dhootha web series: 38 భాషల్లోకి డబ్ చేసిన నాగచైతన్య వెబ్ సిరీస్

Ranbir Alia daughter Raha: కెమెరాల ముందుకు కుమార్తె రాహా, వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు

Anchor Suma: మీడియా మీద సంచలన కామెంట్స్, ఆ వెటకారమే వద్దు అని హెచ్చరిక, క్షమాపణ

Updated Date - Dec 26 , 2023 | 01:42 PM