Anchor Suma: మీడియా మీద సంచలన కామెంట్స్, ఆ వెటకారమే వద్దు అని హెచ్చరిక, క్షమాపణ

ABN , First Publish Date - 2023-10-26T11:33:24+05:30 IST

యాంకర్ సుమ మీడియా మీద సంచలన కామెంట్స్ చేశారు. 'స్నాక్స్ బొజనంలా కాకుండా స్నాక్స్ లా తిని లోపలి రండి' అని అన్నారు. జోక్ వేసాను అని అన్నారు సుమ, ఆ వెటకారమే వద్దు అని మీడియావాళ్లు ఆమెకి గట్టిగా చెప్పారు, తరువాత మీడియా వాళ్ళకి ఆమె క్షమాపణ చెప్పింది.

Anchor Suma: మీడియా మీద సంచలన కామెంట్స్, ఆ వెటకారమే వద్దు అని హెచ్చరిక, క్షమాపణ
Suma Kanakala

ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్, నటి సుమ కనకాల (SumaKanakala) లేని ఫిలిం ఫంక్షన్ లేదు. పరిశ్రమలో సుమ ఒక ప్రత్యేక శైలి, ఒక ఇంటర్వ్యూ చెయ్యాలన్నా, ఒక ప్రీ రిలీజ్ వేడుక జరపాలన్నా, ఒక పాట విడుదల చెయ్యాలన్నా దేనికైనా సుమనే యాంకర్ గా పరిశ్రమలో చాలామంది పెట్టుకుంటారు. సుమ కూడా అంత బాగా చేస్తారు కూడా, అందుకే ఆమెకున్నపేరు మరెవరికీ లేదనే చెప్పాలి. మిగతా ఏ యాంకర్ అయినా, మేము సుమక్క ని ఫాలో అవుతామని చెపుతారు తప్ప, ఆమెని బీట్ చెయ్యలేదు ఇంతవరకు ఎవరూ.

సుమకి డిమాండ్ కూడా అలానే వుంది, ఆమె పారితోషికం కూడా అలాగే డిమాండ్ చేస్తారు అని కూడా పరిశ్రమలో ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. ఆమె గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అటువంటి సుమ మీడియా వాళ్ళ మీద సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, నిన్న 'ఆదికేశవ' #Aadikeshava సాంగ్ లాంచ్ అయింది. వైష్ణవ తేజ్ (VaishnavTej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. ఈ ఫంక్షన్ కి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

sumakanakala1.jpg

ఇందులో భాగంగా ఆమె మీడియా వాళ్ళని ఆహ్వానిస్తూ, "మీరు స్నాక్స్ (టిఫిన్) భోజనంలా తింటున్నారు, త్వరగా లోపలికి వచ్చి మీ మీ కెమెరాలను ఇక్కడ పెట్టాలని కోరుతున్నాము", అని చెప్పి, మళ్ళీ "బాబూ, నువ్వు ముగ్గురికి చెప్పు, వాళ్లను మరో ముగ్గురికి చెప్పమని చెప్పు, తొందరగా రండి'' అని ఆమె మీడియావాళ్లకి చెప్పారు. అయితే ఆమె జోక్ వేశానని అనుకున్నారు. కానీ అది జోక్ ఎలా అవుతుంది. మీడియావాళ్లకి కోపం వచ్చింది, వెంటనే ప్రశ్నలు అడిగే సమయంలో ముందుగా సుమని మీరు ఆలా మీడియా వాళ్ళమీద జోక్స్ వేస్తె బాగోదు హర్ట్ అయ్యాం అని చెప్పారు.

అయితే ఆమె వెంటనే అది నేను జోక్ గా అన్నాను. ఎందుకంటే మీడియా వాళ్లంతా చాలా ఏళ్ళ నుంచి నాకు తెలిసినవారే, ఆ చనువుతో అలా మాట్లాడాను అని అన్నారు సుమ. అయితే ఆలా మీడియా వాళ్ళమీద వెయ్యొద్దు అనగానే, దానికి ఆమె మరో వ్యంగాస్త్రం సంధించింది. "అంటే స్నాక్స్ ను స్నాక్స్ లా తిన్నారు ఓకేనా' అని అన్నారు సుమ. ఇది పుండు మీద కారం జల్లినట్టుగా మరికొంచెం హర్ట్ అయినట్టుగా మీడియా వాళ్ళు కన్పించారు. అదే, ఆ వ్యంగాస్త్రమే వద్దన్నది, అదీ మీడియా మీద, అని సమాధానం చెప్పారు సుమకి. సుమ వ్యాఖ్యాతగా చెయ్యడం ఇష్టమేగానీ, మీడియా విషయంలో మాత్రం ఇలాంటివి వద్దు అని మీడియా వ్యక్తి ఆమెకి గట్టిగా చెప్పారు.

మీడియావాళ్లను తన మాటలకు చాలా హర్ట్ అయ్యారని తెలుసుకున్న సుమ మీడియా వాళ్ళను క్షమాపణలు కోరారు. ఆ ఫంక్షన్ అయిపోయిన తరువాత, సుమ సాంఘీక మాధ్యమంలో మీడియావాళ్లని నిండు మనసుతో క్షమించమని ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. "మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్‌ లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నాను. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆ వీడియోలో చెప్పారు సుమ. ప్రస్తుతం ఈ వీడియో, ఆమె మీడియా మీద్ద చేసిన వ్యాఖ్యలు రెండూ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Updated Date - 2023-10-26T11:33:24+05:30 IST