Ranbir Alia daughter Raha: కెమెరాల ముందుకు కుమార్తె రాహా, వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు

ABN , Publish Date - Dec 25 , 2023 | 04:50 PM

ఇన్ని రోజులూ తమ కూతురు రాహా మొహం ఎవరికీ కనపడకుండా దాస్తూ వచ్చిన రణబీర్ కపూర్, అలియా భట్ దంపతులు ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా తమ కూతురుని ప్రపంచం మొత్తానికి చూపించారు. రాహా వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Ranbir Alia daughter Raha: కెమెరాల ముందుకు కుమార్తె రాహా, వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Ranbir Kapoor and Alia Bhatt reveals their daughter Raha's face to the world

రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) ల ముద్దుల కుమార్తె రాహా ని ఈరోజు కెమెరాల ముందుకు తీసుకు వచ్చారు. ఎన్నాళ్ళ నుండో ఆమె మొహం కనపడనీయకుండా దాచిపెట్టిన తల్లిదండ్రులు రణబీర్, అలియా ఈరోజు ఆమెని అందరికీ చూపించి ఆశ్చర్య చకితుల్ని చేశారు. ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా కపూర్ కుటుంబం అంతా ముంబై లోని జుహూలో తమ ఇంట్లో మధ్యాహ్న భోజనానికి తరలి వచ్చారు. అప్పుడు తమ కుమార్తె రాహాని #Raha బయటి ప్రపంచానికి చూపించాలని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. (Ranbir Kapoor and Alia Bhatt reveal their daughter Raha's face to the public)

ranbiraliadaughterraha.jpg

ముద్దుల కుమార్తె రాహా #Raha ఎంతో క్యూట్ గా చాలా అందంగా వుంది. ఇంకేముంది ఆమె మొహం ప్రపంచం అంతా ఇప్పుడు చూస్తోంది, అందుకని ఆమె తాత రిషి కపూర్ (Rishi Kapoor) లా వుంది అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొంతమంది రాజ్ కపూర్ (Raj Kapoor) మొహంలా వుంది, కళ్ళు మాత్రం కపూర్ కుటుంబంలో వాళ్ళు అందరివీ ఎలా వుంటాయో రాహా కూడా అలానే వచ్చాయి అని కామెంట్స్ చేస్తున్నారు.

ranbirdaughterraha.jpg

నిన్న ఆదివారం అలియా భట్ తండ్రి మహేష్ భట్ (Mahesh Bhat) ఇంట్లో అందరూ కలుసుకున్నారు. అక్కడ జరిగిన క్రిస్మస్ పార్టీ ఫోటోలు అలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తరువాత ఈరోజు కపూర్ ఇంట్లో కపూర్ కుటుంబ సభ్యులు అందరూ కలుసుకున్నారు. ఇంతకు ముందు కూడా అలియా రాహా ఫోటోస్ షేర్ చేశారు కానీ, ఆమె మొహం మాత్రం చూపించలేదు. రాహా మొదటి పుట్టినరోజు నాడు ఆమె చేతుల్లో పువ్వులు వున్నట్టుగా చూపించారు. ఇప్పుడు రాహాని ఏకంగా ప్రపంచారానికి పరిచయం చేశారు రణబీర్, అలియా దంపతులు. ఇంకేముంది ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి.

Updated Date - Dec 25 , 2023 | 04:50 PM