సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్‌ నుంచి ఊహించని ట్వీట్

ABN, First Publish Date - 2023-05-08T18:06:30+05:30

ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై ఓ ట్వీట్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో.. ‘OG’ మరోసారి సోషల్ మీడియాలో టాప్‌లో

Power Star Pawan Kalyan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా.. ‘సాహో’ (Sahoo) దర్శకుడు సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (DVV Entertainment) పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danaiah) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)గా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌‌ను మేకర్స్ విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ నుంచి ‘ఓజీ’ (OG) అప్‌డేట్స్ వస్తే.. ఇప్పుడు, ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై ఓ ట్వీట్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో.. ‘OG’ మరోసారి సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమని ట్వీట్ చేశారంటే.. ‘‘మహారాష్ట్రలోని ‘వాయ్’ లేక్‌ (Wai Lake) వద్ద ‘ఓజీ’ షూటింగ్‌లో ఉండగా.. ఇలా జనసైనిక్స్‌ని కలిశాను. ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కొవ్వూర్‌కి చెందిన జనసైనిక్స్ సింగిరి సాయి, సింగిరి రాజేష్ మరియు సన్నీ జాన్‌లు కలిశాను’’ అంటూ.. లేక్ వద్ద వారు జనసేన జెండా పట్టుకుని ఉన్న పిక్‌ని షేర్ చేశారు. ఈ పిక్‌లో ‘ఖుషి’ (Kushi), ‘అన్నవరం’ (Annavaram) సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే సీన్లలో వేసే డ్రస్సులో ఆయన కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ముఖ్యంగా ‘ఖుషి’ సినిమాలో ఫస్ట్ ఫైట్ వచ్చే ముందు ఎలా అయితే కనిపించాడో.. సేమ్ టు సేమ్ అలా కనిపిస్తుండటంతో.. ఆ మూవీ పిక్‌ని షేర్ చేస్తూ.. ‘ఓజీ’తో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరో వైపు చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన సినిమాలకు సంబంధించి ట్వీట్ చేశాడంటూ కూడా కొందరు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రాజకీయాల (Politics)కు సంబంధించి తప్పితే.. తను చేసే సినిమాలకు సంబంధించి ట్వీట్ చేసిందే లేదు. అసలు సినిమా గురించి ఆయన ట్వీట్స్ వేయడం చాలా అరుదు. అయితే.. ఇందులో సినిమా అనే కాదు.. ఆయన పార్టీకి సంబంధించి కూడా మ్యాటర్ ఉంది కాబట్టే.. అలా ట్వీట్ చేశారని.. నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘ఓజీ’ విషయానికి వస్తే.. ఇందులో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Balagam: ఉత్త‌మ న‌టుడు సాయిలు, ఉత్త‌మ స‌హన‌టుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్

*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?

*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు

*The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?

*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

Updated Date - 2023-05-08T18:06:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!