Pawan Kalyan: అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-08-21T19:50:50+05:30 IST

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆయనొక లేఖను విడుదల చేశారు. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం అంటూ మెగాస్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు
Pawan Kalyan and Chiranjeevi

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PowerStar Pawan Kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆయనొక లేఖను విడుదల చేశారు. అందులో..


‘‘అన్నయ్య చిరంజీవిగారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. (Pawan Kalyan Birthday Greetings to Megastar Chiranjeevi)

Janasena.jpg

కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..!’’ అని మెగాస్టార్‌కి పవర్‌స్టార్ శుభాకాంక్షలు తెలియజేశారు. (HBDMegastarChiranjeevi)


ఇవి కూడా చదవండి:

***************************************

*GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

***************************************

*Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?

***************************************

*Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?

***************************************

*Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..

***************************************

Updated Date - 2023-08-21T19:50:50+05:30 IST