కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

ABN, First Publish Date - 2023-09-01T18:46:46+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాకు ఓకే చెప్పారు. ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘సైరా’ వంటి చిత్రాలతో దర్శకుడిగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆఫీస్‌ని శుక్రవారం గ్రాండ్‌గా ప్రారంభించారు.

Pawan Kalyan New Film Office Launch Event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరో సినిమాకు ఓకే చెప్పారు. ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘సైరా’ వంటి చిత్రాలతో దర్శకుడిగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆఫీస్‌ని శుక్రవారం గ్రాండ్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చింది. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమానే చేయాలి. కానీ, ఈ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎక్కడ వార్తలు రాకపోవడంతో.. అంతా ఆగిపోయిందనే అనుకున్నారు. కానీ, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే ఈ సినిమా ఆఫీస్‌ను ప్రారంభించడంతో.. ఇప్పుడు పవన్ ఖాతాలో మరో సినిమా యాడ్ అయింది.


ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని ఎంతగానో అభిమానించే నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ (SRT Entertainments) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథను అందించనున్నారు. తాజాగా జరిగిన ఆఫీస్ పూజా కార్యక్రమాలలో నిర్మాత రామ్ తాళ్లూరితో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి, కథకుడు వక్కంతం వంశీ పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి విషయానికి వస్తే.. ఇంతకు ముందు ఆయన అక్కినేని అఖిల్‌తో చేసిన ‘ఏజెంట్’ చిత్రం భారీ పరాజయం చవిచూసింది. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కసి మీద సురేందర్ రెడ్డి ఉన్నారు.

వక్కంతం వంశీ ప్రస్తుతం నితిన్‌‌ను డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఓ అద్భుతమైన స్ర్కిప్ట్ తయారు చేశారని, అందుకే పవన్ కళ్యాణ్ మిత్రుడైన, ఆయనని ఎంతగానో అభిమానించే రామ్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా పవర్ స్టార్ బర్త్‌డే రోజు (సెప్టెంబర్ 2) రాబోతుందనేది తాజా సమాచారం.


ఇవి కూడా చదవండి:

============================

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

*Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

**********************************

Updated Date - 2023-09-01T18:46:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!