‘బై వన్‌ టికెట్.. గెట్‌ వన్‌ ఫ్రీ’.. నిర్మాత బంపరాఫర్

ABN , First Publish Date - 2023-12-03T20:01:04+05:30 IST

ప్రముఖ నిర్మాత, దర్శకుడు, పంపిణీదారుడు, థియేటర్‌ యజమాని కేఆర్‌ (KR).. ఇప్పుడు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టిన నిర్మాత ఇప్పటివరకు లేకపోవడం గమనార్హం. ఆయన నిర్మించిన సరికొత్త చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుండగా.. దీనికోసం ‘బై వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ’ మూవీ టిక్కెట్‌ ఆఫర్‌ ప్రకటించారు.

‘బై వన్‌ టికెట్.. గెట్‌ వన్‌ ఫ్రీ’.. నిర్మాత బంపరాఫర్
Aayiram Porkasugal Still

కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, పంపిణీదారుడు, థియేటర్‌ యజమాని కేఆర్‌ (KR).. ఇప్పుడు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టిన నిర్మాత ఇప్పటివరకు లేకపోవడం గమనార్హం. ఆయన నిర్మించిన సరికొత్త చిత్రం ‘ఆయిరం పొర్‌కాసుగల్‌’ ఈనెల 22న విడుదలకానుంది. దీనికోసం ‘బై వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ’ మూవీ టిక్కెట్‌ ఆఫర్‌ ప్రకటించారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ... ఒక సినిమా తలరాతను నిర్ణయించేది... మొదటి రోజు మొదటి ఆట. ఇటీవల భారీ బడ్జెట్‌ చిత్రాలు వ్యాపారపరంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కానీ, మంచి కథలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. చిన్న బడ్జెట్‌ చిత్రాలు నిర్మించవద్దని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదు. అందుకే ఏదో ఒకటి చేసి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ‘బై వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ’ మూవీ టిక్కెట్‌ ఆఫర్‌. పెద్ద చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడం సంతోషంగా ఉన్నప్పటికీ... చిన్న చిత్రాలకు ఆదరణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు.


RK.jpg

ఇప్పుడున్న అగ్ర నటీనటులు, టెక్నీషియన్లు ఒకప్పుడు చిన్న చిత్రాల్లో నటించి తమ కెరీర్‌ను ప్రారంభించినవారే. అందుకే చిన్న బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలను ప్రోత్సహించేలా ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్‌ యజమానులతో నాకు మంచి స్నేహసంబంధాలున్నాయి. వారంతా ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచారు. ఈ విధానం నేను నిర్మించిన ‘ఆయిరం పొర్‌కాసుగల్‌’ చిత్రంతోనే శ్రీకారం చుడుతున్నానని అన్నారు. కాగా, ఈ చిత్రంలో విదార్ధ్‌, శరవణన్‌, అరుంధతి నాయర్‌ తదితరులు నటించగా.. రవి మురుకయ్య దర్శకత్వం వహించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Charan Arjun: రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది

***********************************

*Anasuya: ఓటమిని ఒప్పుకున్న కేటీఆర్.. ప్రేమలో పడ్డానంటూ అనసూయ ట్వీట్

***********************************

*Shah Rukh Khan: ‘డంకీ’ సాంగ్‌పై షారూక్ భావోద్వేగం

************************************

Updated Date - 2023-12-03T20:03:10+05:30 IST