Atharva: ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

ABN , First Publish Date - 2023-11-04T19:54:22+05:30 IST

కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ మీడియా సమక్షంలో ప్రకటించారు. ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.

Atharva: ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది
Karthik Raju and Simran Choudhary

కార్తీక్ రాజు (Karthik Raju), సిమ్రాన్ చౌదరి (Simran Choudhary), ఐరా (Ayraa) హీరోహీరోయిన్లుగా నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘అథర్వ’ (Atharva). మహేష్ రెడ్డి (Mahesh Reddy) దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్ జానర్‌‌‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో సిద్ధచేసినట్లుగా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని సెన్సార్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించేందుకు మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో.. భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. (Atharva Movie Release Date Announcement)

ఈ సందర్భంగా డైరెక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక క్రైమ్ సీన్‌లో క్లూ అనేది చాలా ఇంపార్టెంట్. రాబరీ కేస్ అయినా, మర్డర్ కేస్ అయినా దేన్నీ కూడా క్లూస్ లేకుండా ఛేజ్ చేయలేము. ఒక కేసులో ఎంతో ఇంపార్టెంట్ అయిన క్లూస్‌ని, ఎవిడెన్స్‌ని ఐడెంటిఫై చేసే క్లూస్ డిపార్ట్మెంట్ గురించి ఈ మూవీ. ఈ సినిమాలో కార్తీక్ రాజు బయోమెట్రిక్ అనలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి ఒక జర్నలిస్ట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్టర్స్ అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. టెక్నిషియన్స్ చాలా బాగా కష్టపడ్డారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాం. మా సినిమాకు మీడియా సపోర్ట్ కావాలి. డిసెంబర్ 1న ‘అథర్వ’ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్‌కి వచ్చి చూడండని తెలిపారు. నిర్మాత సుభాష్ నూతలపాటి (Subhash Nuthalapati) మాట్లాడుతూ.. మీడియాకు ధన్యవాదాలు. ఎంతో మంది ప్యాషన్ ఉన్న వాళ్ళు కలిసి కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా అథర్వ. మా సినిమాకు సపోర్ట్ చేసి మీడియా వాళ్ళు జనాల్లోకి తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు


simran.jpg

చిత్ర హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. చాలా మంది కొత్త అటెంప్ట్ చేస్తున్నామని తమ సినిమా గురించి చెప్తారు. కానీ ఇది నిజంగా కొత్త కాన్సెప్ట్. నాకు తెలిసినంతవరకు క్లూస్ టీమ్ మీద ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ సినిమా తీయలేదు. డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా ఇది. రీసెంట్‌గా క్లూస్ డిపార్ట్మెంట్‌కు ప్రత్యేక షో వేసినప్పుడు.. వాళ్లంతా సినిమా చూసి డైరెక్టర్ పర్ఫెక్షన్ చాలా బాగుందన్నారు. ప్రతి పాయింట్ చాలా పక్కాగా రాసుకున్నారు అన్నారు. సిమ్రాన్ ఇందులో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తుంది. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నిర్మాత సుభాష్‌కి ఇది మొదటి సినిమా, బాగా డబ్బులు వస్తాయి ఈ సినిమాకు నేను గ్యారెంటీ. ఈ సినిమా రిలీజయ్యాక దీని కోసం పనిచేసిన వారందరికీ మంచి పేరు వస్తుంది. డిసెంబర్ 1న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతోంది. మీడియా సపోర్ట్ కావాలని అన్నారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ.. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కి మంచి పేరు వచ్చింది. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశాం. డిసెంబర్ 1న ఈ సినిమాని సురేష్ బాబు‌గారు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండని కోరారు. (Atharva Movie)


ఇవి కూడా చదవండి:

========================

*Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..

*************************************

*Karthi: ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే..

***************************************

*Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?

***************************************

Updated Date - 2023-11-04T19:54:23+05:30 IST