Right: ఇయర్ ఎండింగ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ సందడి.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే!

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:55 PM

బిగ్‌బాస్ తెలుగు‌ సీజన్ 2 విన్నర్ కౌశల్.. కొంతగాలంగా సైలెంట్‌గా ఉన్నా.. ఈ ఇయర్ ఎండింగ్‌‌కి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్‌లో మాత్రం నన్ను కొట్టేటోడే లేడు అనేలా.. డిసెంబర్ 30న ‘రైట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Right: ఇయర్ ఎండింగ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ సందడి.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే!
Kaushal Manda and Leesha Eclairs

బిగ్‌బాస్ తెలుగు‌ సీజన్ 2 విన్నర్ కౌశల్ (Kaushal Manda).. కొంతగాలంగా సైలెంట్‌గా ఉన్నా.. ఈ ఇయర్ ఎండింగ్‌‌కి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్‌లో మాత్రం నన్ను కొట్టేటోడే లేడు అనేలా.. సడెన్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘రైట్’ సినిమా డిసెంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మణి దీప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రైట్’ (Right). మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన ‘మెమోరీస్’ చిత్రాన్ని తెలుగులో ‘రైట్’గా నిర్మాతలు లుకలపు మధు, మహంకాళి దివాకర్ రీమేక్ చేశారు. సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని అన్నారు మంచు మనోజ్.

ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ (Manchu Manoj) మాట్లాడుతూ... స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చి, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్‌లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలి. ‘రైట్’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని చెబుతూ.. ప్రముఖ నటుడు విజయకాంత్‌ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని, సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారని అన్నారు. నటుడిగానే కాకుండా మంచి రాజకీయ ఆలోచనా విధానం ఉన్న వ్యక్తి అని, ప్రతి రోజూ చెన్నై‌లో ఆయన ఇంటి ముందు 2, 3 వందల మంది వచ్చేవారిని, ఆకలితో వచ్చిన ఏ ఒక్కరినీ అన్నం పెట్టకుండా పంపేవారు కాదని గుర్తు చేసుకుంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. (Right Movie Ready to Release)


Manchu-Manoj.jpg

హీరో కౌశల్ మాట్లాడుతూ... నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో ‘రాజకుమారుడు’ సినిమాతో పరిశ్రమకు వచ్చాను. 24 ఏళ్ల తర్వాత బిగ్‌బాస్ రూపంలో కలిసి వచ్చింది. నా కోసం ఒక ఆర్మీ తయారు కావడం నేను చేసుకున్న అదృష్టం. నా ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా ఫ్యాన్స్ నన్ను హీరోగా చూడాలనే కోరికను కోరడంతో ఇప్పుడు హీరోగా వస్తున్నాను. మా తాత గారు ఆంధ్ర నాట్య మండలిలో ఎస్‌వి రంగారావు, జగ్గయ్య, అల్లు రామలింగయ్య వంటి మహామహులతో కలిసి నాటకాలు, పరిషత్‌లు చేశారు. మా నాన్నగారు 8 సార్లు ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్‌గా నిలిచినా గుర్తింపు రాలేదు.. కానీ నా ఫ్యాన్స్ ఆదరణతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత మొదటి సిట్టింగ్‌లోనే ఈ సినిమా నాతోనే చేస్తానని దర్శకులు శంకర్ అన్నారని నిర్మాతలు చెప్పారు. ఆది సాయికుమార్‌తో కలిసి బ్లాక్ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ సినిమాకు నిర్మాతలు మహంకాళీ దివాకర్, మధులు పచ్చ జెండా ఊపారు. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. చిన్నా, పెద్దా అనే తేడాలు లేకుండా అందరినీ ప్రోత్సహించే గొప్ప వ్యక్తి మంచు మనోజ్ ఈ కార్యక్రమానికి వచ్చి టీం ను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. హీరోగానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి ఎప్పటికీ సిద్దంగా ఉంటా. ప్రేక్షకులు చిన్న సినిమాలను కూడా పెద్ద మనసుతో ఆదరించాలని కోరుతున్నానని అన్నారు.

కౌశల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం, మహమ్మద్ గజినీలా మళ్ళీ మళ్ళీ పోరాడి సాధించుకునే వ్యక్తిత్వం తనదని హీరో త్రిగూన్ తెలిపారు. ఈ సినిమా హిట్ కొడుతుందని, ఇందులో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఇక్కడి సినిమా ప్రేమికులను నమ్మి తాను తెలుగు సినిమాకు వచ్చానని, ప్రేక్షకులు తనకు ప్రోత్సాహం అందించాలని హీరోయిన్ లీషా ఎక్లైర్స్ కోరారు. కౌశల్ ప్రయాణంలో తన భార్య నీలిమ కృషి ఎంతో ఉందని ఆమె గుర్తు చేశారు. నిబద్దతతో, అనుభవంతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకులు శంకర్ తెలిపారు. ఈ కథకు కౌశల్ మాత్రమే సరిపోతారని ఎంచుకుని మరీ రూపొందించామన్నారు నిర్మాతలు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్ని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vijayakanth: రియల్ హీరో విజయకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా? కెప్టెన్‌ స్మృతిలో రాష్ట్రం

***************************

*Hansika: హన్సిక 105 నిమిషాలతో రెడీ అవుతోంది.. ఈసారి ఏం చేస్తుందో?

*************************

*Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

**************************

Updated Date - Dec 29 , 2023 | 07:02 PM