Varun-Lavanya: కొడుకు పెళ్లి వార్తలపై నాగబాబు అలా!.. సోషల్ మీడియాలో వరుణ్ ఇలా!

ABN , First Publish Date - 2023-06-02T15:51:35+05:30 IST

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వార్తలపై మెగా బ్రదర్ మాట్లాడిన ఓల్డ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లికి సంబంధించి త్వరలోనే వరుణ్ ప్రకటిస్తాడని నాగబాబు చెబుతున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ ఫారిన్‌లో పిజ్జా తింటూ.. కుకింగ్ క్లాసెస్‌‌లో పాల్గొంటున్నట్లుగా సోషల్ మీడియాలో తెలిపారు.

Varun-Lavanya: కొడుకు పెళ్లి వార్తలపై నాగబాబు అలా!.. సోషల్ మీడియాలో వరుణ్ ఇలా!
Nagababu and Lavanya Traipathi with Varun Tej

మెగా బ్రదర్ నాగబాబు (MegaBrother Nagababu) కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi)ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు కానీ.. ప్రస్తుతం వారిద్దరి పెళ్లి విషయంలో ఇంకాస్త అప్‌డేట్ అయితే వినిపిస్తోంది. అదేంటంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (Varun Tej and Lavanya Tripathi) ఇద్దరూ జూన్ 9న నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. అయితే ఈ వార్తపై ఇరు ఫ్యామిలీలు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదుకానీ.. ఇదే విషయంలో ఈ మధ్య నాగబాబు మాట్లాడిన ఓ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారట కదా.. నిజమేనా? అని యాంకర్ అడగగా.. “ఆ విషయంపై నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. వరుణ్ పెళ్లి (Varun Tej Marriage) గురించి త్వరలో ప్రకటిస్తాం. ఎవరనే దానిపై నేనేం కామెంట్ చేయను. త్వరలో వరుణ్ బాబే ప్రకటిస్తాడు..’’ అని అన్నారు. ఇంకా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. మాది జాయింట్ ఫ్యామిలీ కాదు కానీ.. అందరం కలుస్తూనే ఉంటాం. వరుణ్ సెపరేట్‌గా ఉంటాడు. నిహారిక (Niharika) కూడా తన ఇంట్లోనే ఉంటుంది. మేమంతా సెపరేట్ ఇళ్లల్లో ఉంటున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటాం. వారి నుంచి నేనేమీ ఆశించడం లేదు. పెద్దవాళ్లు అయ్యారు.. సొంతంగా ఆలోచించగలరు.. కాబట్టి వారి లైఫ్ వారిష్టం, నేనయితే ఎలాంటి ఒత్తిడి చేయను’’ అని నాగబాబు (Nagababu) చెప్పుకొచ్చారు. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తుంది. ప్రస్తుతం నిశ్చితార్థపు తేదీ అంటూ రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం.. అటు లావణ్య ఫ్యామిలీగానీ, ఇటు మెగా ఫ్యామిలీ (Mega Family) నుంచిగానీ ఎవరూ స్పందించలేదు.. వినిపిస్తున్న వార్తలని ఖండించలేదు. దీంతో నిజంగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒక్కటి కాబోతున్నారనేలా టాక్ అయితే నడుస్తూనే ఉంది.

Mega-Prince.jpg

పిజ్జా తింటూ.. మరో వంటను ప్రిపేర్ చేస్తోన్న వరుణ్

ఒకవైపు నిశ్చితార్థం అంటూ వార్తలు వైరల్ అవుతుంటే.. వరుణ్ తేజ్ మాత్రం హాయిగా ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇటలీ (Italy)లో పిజ్జా తింటున్న పిక్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. పిజ్జా (Pizza) తినడమే కాకుండా.. తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ వంటకం అయిన గవ్వలని ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పిక్‌లో వరుణ్ తేజ్‌ని చూసిన నెటిజన్ల రియాక్షన్ అయితే మాములుగా లేదు. ‘ఇంకొన్ని రోజుల్లో నిశ్చితార్థం (Varun Tej Engagement) పెట్టుకుని.. నువ్వేంటి బ్రో పిజ్జా తింటావ్’, ‘నీతో పాటు లావణ్య కూడా ఉందా’, ‘పెళ్లి కదా.. వంటలు నేర్చుకుంటున్నావన్నమాట’.. ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ పోస్ట్ టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*PedaKapu1: ‘పెదకాపు1’.. శ్రీకాంత్ అడ్డాల ఈసారి డైరెక్ట్ అటాక్

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

*Mahesh Yuvasena: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఎంత గొప్పగా ఆలోచించారో చూశారా?

*Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం

*Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

Updated Date - 2023-06-02T15:58:53+05:30 IST