కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manchu Lakshmi: ఏపీ రాజకీయాలపై ‘ఇంట్రెస్టింగ్’ ట్వీట్..

ABN, First Publish Date - 2023-09-15T21:45:05+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎంత హాట్ హాట్‌గా తెలియంది కాదు. ప్రతి ఒక్కరూ ఏపీ మాజీ సీఎం అక్రమ అరెస్ట్‌పైనే మాట్లాడుతూ.. అరెస్ట్ దారుణం అంటూ ఖండిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ.. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Manchu Lakshmi Prasanna

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం (AP Politics) ఎంత హాట్ హాట్‌గా ఉందో తెలియంది కాదు. ప్రతి ఒక్కరూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పైనే మాట్లాడుతూ.. అరెస్ట్ దారుణం అంటూ ఖండిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. జైలులో చంద్రబాబుని కలిసి వచ్చిన అనంతరం చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్‌ మరింత హీటెక్కాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిసి తదుపరి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయని ఆయన అనౌన్స్ చేసిన తీరు, ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు.. ఇప్పుడందరినీ ఏపీ రాజకీయాల వైపు చూసేలా చేస్తున్నాయి. తాజాగా మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా ఏపీ పాలిటిక్స్‌పై ‘ఇంట్రెస్టింగ్’ అంటూ ట్వీట్ చేశారు.

‘వాహ్!!! ఏపీ రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇంతకీ ఎటు సైడ్ ఆడుతున్నారు అండి మీరు?’ అని కొందరు, ‘ఇప్పుడే నిద్రలేచావా అక్కా’, ‘అక్కో.. ఏంటీ యటకారం’ అంటూ మరికొందరు.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే.. మంచు మోహన్ బాబుకి పాలిటిక్స్ ఏం కొత్తకాదు. మంచు విష్ణు, మంచు మనోజ్ వంటి వారు డైరెక్ట్‌గా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టలేదు కానీ.. వారికి కూడా మంచి అవగాహనే ఉంది. కానీ మంచు లక్ష్మీ మాత్రం ఏ పార్టీకి సపోర్ట్ అన్నట్లుగా ఇప్పటి వరకు వ్యవహరించలేదు. ఇప్పుడామె ట్వీట్‌కు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు చూస్తుంటే మాత్రం.. మంచు లక్ష్మీ కూడా ‘ఎటు సైడో’ చెప్పాల్సి వస్తుందేమో.. (Manchu Lakshmi Tweet on AP Politics)


ప్రస్తుతం మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘అగ్నినక్షత్రం’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచు లక్ష్మీ ఎంతో నమ్మకంగా ఉంది.


ఇవి కూడా చదవండి:

============================

*Anand Deverakonda: నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని..

************************************

*Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..

**********************************

*Vijay Deverakonda: 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష.. ఈ పనితో ‘ఖుషీ’గా ఉంది

**********************************

*Japan: ‘జపాన్’ డబ్బింగ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన మేకర్స్

*********************************

Updated Date - 2023-09-15T21:45:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!