Anand Deverakonda: నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని..

ABN , First Publish Date - 2023-09-15T20:46:15+05:30 IST

రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం ‘గం..గం..గణేశా’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ చిత్రంతో.. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Anand Deverakonda: నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని..
Gam Gam Ganesha Team

రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ (Baby) సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘గం..గం..గణేశా’. ఇప్పటి వరకు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) చేయని యాక్షన్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను.. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ డైరెక్టర్ వినోద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. బేబీ సినిమా విడుదలై రెండు నెలలు అవుతోంది. ఈ రెండు నెలల్లో ‘బేబీ’ సినిమాపై ప్రేక్షకులు చూపించిన లవ్‌ను మరిచిపోలేను. ‘బేబీ’ సినిమాలో ఎంత ఎమోషనల్ అయ్యారో ‘గం..గం..గణేశా’లో అంత ఎంటర్‌టైన్ అవుతారు. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్‌తో పనిచేస్తున్నా. నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాడిని. ఫన్, క్రైమ్, యాక్షన్ వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీ ఇది. ఈ సినిమా సూపర్బ్‌గా ఉంటుంది. కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం. రేపు థియేటర్‌లో మీరు (ప్రేక్షకులు) కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. బేబీ, ఈ సినిమా రెండు ప్యారలల్‌గా చేశాను. కొన్నిసార్లు నిరాశగా అనిపించేది. కొన్నిసార్లు మోటివేటెడ్‌గా అనిపించేది. అన్ని సందర్భాల్లో డైరెక్టర్ ఉదయ్ స్ట్రాంగ్‌గా ఉండేవాడు. హీరోగా ఇది నాకు ఆరో సినిమా. ఇందులో నలుగురు కొత్త దర్శకులు నాతో ఇండస్ట్రీకి వచ్చారు. (Gam Gam Ganesha Teaser Launch)


Ganeshaa.jpg

మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. మెలొడీ, ర్యాప్ సాంగ్స్..ఇలా సాంగ్స్, బీజీఎం అదిరిపోతాయి. కో ప్రొడ్యూసర్ అనురాగ్ గారు మూవీకి ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. వంశీ, కేదార్ బిగ్ ప్రొడ్యూసర్స్ అవుతారు. భయం, అత్యాశ, కుట్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంటుంది. సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరి ప్లాన్స్‌తో వారు ఉంటారు. రేసీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే చూస్తారు. నా గత చిత్రాలతో చూస్తే చాలా డిఫరెంట్ మూవీ ఇది. నేను కథను నమ్మే సినిమా సెలెక్ట్ చేసుకుంటా. కొత్త వాళ్లైనా, ఎక్స్‌పీరియన్స్డ్ డైరెక్టర్స్ అయినా హిట్స్, ఫ్లాప్స్ ఇస్తారు. కానీ ప్రతి దర్శకుడికి ఓ విజన్ ఉంటుంది. నేను దాన్ని నమ్మి సినిమా చేస్తాను. ‘గం..గం..గణేశా’ మూవీ బేబీ సినిమా కలెక్షన్స్ దాటేస్తుందనే లాంటి లెక్కలు వేసుకోలేదు. ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుంది. అన్నయ్య విజయ్‌తో ఫ్యూచర్‌లో కలిసి సినిమా చేస్తానేమో చూడాలి. ఇప్పటికైతే అలాంటి ప్రాజెక్ట్ అనుకోలేదని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..

**********************************

*Vijay Deverakonda: 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష.. ఈ పనితో ‘ఖుషీ’గా ఉంది

**********************************

*Japan: ‘జపాన్’ డబ్బింగ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన మేకర్స్

*********************************

*Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం

***********************************

Updated Date - 2023-09-15T20:46:15+05:30 IST