Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..

ABN , First Publish Date - 2023-09-15T19:06:12+05:30 IST

‘కీడా కోలా’.. ఈ పేరు ఎప్పటి నుంచో టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉంది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..
Tharun Bhascker Dhaassyam

‘కీడా కోలా’ (Keedaa Cola).. ఈ పేరు ఎప్పటి నుంచో టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉంది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker Dhaassyam) దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్.. ‘కీడా కోలా’ పేరుతో అప్పుడెప్పుడో ఓ సరికొత్త క్రైమ్ కామెడీ మూవీకి శ్రీకారం చుట్టారు. హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్ మంచి స్పందననే రాబట్టుకున్నాయి కానీ.. విడుదల తేదీ విషయంలో కాస్త సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల తేదీని శుక్రవారం ప్రకటించారు.


Brahmi.jpg

నవంబర్ 3న ఈ ‘కీడా కోలా’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ ఆసక్తికర పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. చిత్ర సమర్పకుడు రానా కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ చిత్ర విడుదల తేదీని పోస్ట్ చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు.. ప్రధాన తారాగణం అంతా సీరియస్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. ఈ సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. (Keedaa Cola Release Date)

‘కీడా కోలా’ విజి సైన్మా మొదటి ప్రొడక్షన్. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటించినట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Vijay Deverakonda: 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష.. ఈ పనితో ‘ఖుషీ’గా ఉంది

**********************************

*Japan: ‘జపాన్’ డబ్బింగ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన మేకర్స్

*********************************

*Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం

***********************************

Updated Date - 2023-09-15T19:06:12+05:30 IST