Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..

ABN , First Publish Date - 2023-08-08T22:47:32+05:30 IST

కోలీవుడ్‌లో సరైన హిట్‌ కోసం పరితపిస్తున్న మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌.. స్విమ్‌ సూట్‌లో కనిపించి తన అభిమానులను ఖుషీ చేశారు. తన స్నేహితులతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న ఆమె... తాజాగా ఓ ఈత కొలను వద్ద పచ్చరంగు స్విమ్‌ సూట్‌ ధరించి వివిధ భంగిమల్లో తీసిన ఫొటోలను షేర్‌ చేశారు.

Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..
Malavika Mohanan

కోలీవుడ్‌లో సరైన హిట్‌ కోసం పరితపిస్తున్న మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan).. స్విమ్‌ సూట్‌ (Swim Suit)లో కనిపించి తన అభిమానులను ఖుషీ చేశారు. తన స్నేహితులతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న ఆమె... తాజాగా ఓ ఈత కొలను వద్ద పచ్చరంగు స్విమ్‌ సూట్‌ ధరించి వివిధ భంగిమల్లో తీసిన ఫొటోలను షేర్‌ చేశారు. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు... ‘పచ్చై నిరమే పచ్చై నిరమే... ఇచ్చై మూట్టుం పచ్చై నిరమే’ అంటూ కవిత రూపంలో కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ‘పేట’, ‘మాస్టర్‌’, ‘మారన్‌’ వంటి చిత్రాల్లో నటించిన మాళవిక.. ఇపుడు చియాన్‌ విక్రమ్‌ సరసన ‘తంగలాన్‌’ చిత్రంలో ఆదివాసి మహిళగా నటించారు. ఇందులో ఆమె వేషధారణ విభిన్నంగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే ఆమె తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ టూర్‌లోనే ఆమె తన పుట్టిన రోజు వేడుకలను కూడా ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకున్నారు. అయితే ఈ మధ్య ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. (Malavika Mohanan In Swim Suit)


Malavika-2.jpg

ఏ చిత్రమైనా సరే.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఇకపై తాను నటించబోనని హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ తెగేసి చెప్పడంతో.. ఇప్పుడామెకు అవకాశాలు వస్తాయా? లేదా? అనేది డౌట్‌గా మారింది. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ... ‘నేను సినిమా పరిశ్రమకు వచ్చి పదేళ్లు పూర్తయింది. ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకున్నా. ఇకపై నటించే చిత్రాల్లో నా పాత్రకు ప్రాధాన్యం లేకపోతే అంగీకరించను. ఎంత భారీ బడ్జెట్ చిత్రమైనా.. నా పాత్రకు ప్రాముఖ్యం లేకపోతే ప్రేక్షకుడు దాన్ని గుర్తు పెట్టుకోరు. అందుకే ఇలాంటి జాగ్రత్త తీసుకున్నా. మంచి చిత్రాలను తెరకెక్కించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేయాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Malavika-3.jpg

Malavika-1.jpg


ఇవి కూడా చదవండి:

***************************************

*Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

***************************************

*Guntur Kaaram: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. రివీలయ్యేది ఎప్పుడంటే?

***************************************

*Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

***************************************

*Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..

***************************************

Updated Date - 2023-08-08T22:47:32+05:30 IST